నేనౌతా!;- -గద్వాల సోమన్న,9966414580
తీయని పలుకులతో
చిలుకమ్మ నేనౌతా!
చక్కని కులుకులతో
నెమలమ్మ నేనౌతా!

మధురమైన గాత్రంతో
కోకిలమ్మ నేనౌతా!
అందమైన మోముతో
పావురమ్మ నేనౌతా!

సొగసునై నడకలతో
హంసమ్మ నేనౌతా!
ముద్దులొలుకు మేనుతో
పిచ్చుకమ్మ నేనౌతా!

కూత వేసె  తొలి జాములో
కోడిపుంజు నేనౌతా!
విహరించే నింగిలో
గోరింక నేనౌతా!


కామెంట్‌లు