పల్లెటూరు కవిత;-కె. ఉషశ్రీ. 9వ తరగతిజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నీర్మాల
అందమైనది మన పల్లెటూరు,
పచ్చని పంట పొలాలు మన పల్లెటూరు,

పద్ధతిగా ఉండే మన పల్లెటూరు,
పచ్చదనం మన పల్లెటూరు,

పాడి పశువుల అరుపులు మన పల్లెటూరు,
ఎడ్ల బండిలు మన పల్లెటూరు,

విశాలంగా ఉండే మన పల్లెటూరు,
కోడి కూత మన పల్లెటూరు,

పక్షుల చప్పుడు మన పల్లెటూరు,
మట్టి ఇల్లులు మన పల్లెటూరు,

నేల సువాసన మన పల్లెటూరు,
రైతన్నలు ఉండే మన పల్లెటూరు,

అలుకు పేడ మన పల్లెటూరు,
ముగ్గులతో మన పల్లెటూరు,

మట్టి కుండలు మన పల్లెటూరు,
భక్తి భజనలు మన పల్లెటూరు,

కట్టే మంచం మన పల్లెటూరు, గట్టుక గంజి మన పల్లెటూరు,

కామెంట్‌లు