బాల్యంలోనే ఏకాగ్రతతో కూడిన లక్ష్యం ఉండాలి; . డాక్టర్ సురవరం పుష్పలత రెడ్డి ;వెంకట్ మొలక ప్రతినిధి

 వికారాబాద్ జిల్లా   దన్నారం గ్రామంలో యజ్ఞ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు వేసవి శిక్షణా శిబిరం  ఏర్పాటు చేశారు 
అందులో భాగంగా విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం  భాషా పరిజ్ఞానం పై  అవగాహన కల్పించారు
యజ్ఞ పౌండేషన్ డైరెక్టర్ డాక్టరు ఉజ్వల్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి 
డాటర్  సురవరం పుష్పలత రెడ్డి ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ చిన్నతనం నుండి విద్యార్థులు ఏకాగ్రతలతో కూడిన 
లక్ష్యం ఏర్పరచుకోవాలన్నారు మానసిక ఆరోగ్యం  ఉండాలి అంటే వ్యాయము యోగ ధ్యానము చేయాలన్నారు గురుకుల 
లో ఉపాధ్యాయులు నేర్పిన క్రమశిక్షణని ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలన్నారు 
 విద్యాదానం ఎంతో గొప్పదని  బాల్యంలోనే మంచి స్నేహితులను కలిగి ఉండాలని  మంచి చెడులపై బాల్యంలోనే బేరీజు  వేసుకోవాలన్నారు  పెద్దలను గౌరవించాలని ముఖ్యంగా సెల్ఫోన్ టీవీలకు సీరియల్లకు దూరంగా ఉండాలని 
సూచించారు భాషతోపాటు దేశాభిమానం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు 
ఈ కార్యక్రమంలో బాలల మాసపత్రిక  "మొలక" హానరరీ ఎడిటర్ శోభా రెడ్డి  మాట్లాడుతూ  మాతృభాష మధురమైంది అమ్మ భాష పై మమకారంతో విజ్ఞానంతో పాటు వినోదం పెంపొందించుకోవాలన్నారు నీతి నిజాయితీ దేశభక్తి లలిత కళలు చిన్నప్పటినుండి తల్లిదండ్రులు గురువుల ద్వారా నేర్చుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మే నెల మొలక బాలల మాసపత్రిక ఆవిష్కరించారుసమ్మర్ క్యాంపులో చెస్, క్యారం బోర్డు మైండ్ గేమ్  విద్యార్థుల ఆక్టివిటీస్ కార్యక్రమాలను తిలకించారు
 కార్యక్రమంలో మొలక ప్రత్యేక ప్రతినిధి సోషల్ వర్కర్ వెంకట్ ఉపాధ్యాయులు వంశి రెడ్డి 
 యజ్ఞ పౌండేషన్ స్కూల్ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు
కామెంట్‌లు