సుప్రభాత కవిత -బృంద
అగుపడ్డ అందం
అంతులేని ఆనందం
మాటలొ చెప్పలేనిది
మూటగా కట్టలేనిది

కనులకు విందౌ సొగసు
కలలతీరమవుతుంటే
భావనలు మదిలో మెదిలి
కవనాలకు ప్రేరణలాయె

చూడగనే పెదవులపై విరిసే
దరహాస చంద్రికల మెరుపు
వేల శశిరేఖల చలువ అనిపించే
ఆకాశాన కురిసే వెలుగు ధార

ప్రత్యూష కిరణాల ప్రకాశాలు
తెలి వెలుగుల ప్రసరిస్తూ
తొలి సంజె తొంగి చూసిన 
ప్రశాంత మానస సరోవరాన

కలతలన్ని చెరిగి పోగా
కన్నీటి వెతలన్నీ తొలగిపోగా
మధుర తీరం చేరిన నావలా
మురిసె ముచ్చటగా  అంతరంగం

లోకానికి అధారమైన సిరిదివ్వె
కాంతులు విరజిమ్మే క్షణాన
నిర్మలమైన మనసంతా
విలక్షణ అనుభూతికి లోనవదా?

హృదయంగమ ఉదయానికి

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు