సుప్రభాత కవిత -బృంద
తేటనీటి తానమాడి
తెలివెలుగుల తేరునెక్కి
తొలి సంధ్య జిలుగులతో
నులివెచ్చగ వచ్చిన భానుడు


చిరు అలల కదలికలొ
చిన్ని చేపల  గెంతులతో
నెమ్మదిగా సాగుతున్న
ప్రవాహాన్ని పలకరించె


కదులుతున్న క్షణాలను
కదుపుతున్న కాలచక్రం
కుదుపులేవీ లేకుండా
కుదురుగా నడపాలని...

కుమ్మరించిన వెలుగులన్నీ
పరచుకున్న పుడమిలో
ఆవరించిన అంధకారపు
ఆనవాళ్ళు మాయమైనట్టే

మాయదారి మబ్బులెన్ని
దారికడ్డు తగిలినా....
మర్మమెరిగి తన దీవెన
నీమముగా ప్రసరింపచేసి

కనులు కన్న స్వప్నాలు
మనసు కోరిన కోరికలు
అవసరంగా తీర్చాలని
పరుగుపరుగున  వస్తున్న

వెన్నెలంటి వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు