సుప్రభాత కవిత ; -బృంద
ఏ దివి నుండి కృప కురియునో
ఏ దైవం అనుగ్రహించునో
ఏ నోములు ఫలించునో
ఏ కలలు సాకారమౌనో

ఎంత సంతోషం మది నింపునో
ఎంత నెమ్మది బ్రతుకున నిండునో
ఎంత ఎదురుచూపు ముగిసెనో
ఎంత బలం ఎదకు చేకూరునో!

ఎన్ని  కలతలు తీరునో
ఎన్ని  ఓదార్పులు కలుగునో
ఎన్ని  అలజడులు అణుగునో
ఎన్ని  బ్రతుకులు వెలుగునో

ఎంతో ఎదురుచూసిన తరుణాలు
ఎంత బరువైనవో నిరీక్షణలు
ఎంత  అవసరమో మార్పులు
ఎంతగానో వేడిన వరాలు

అన్ని దీవెనలూ కలిసి
అన్ని ఆకాంక్షలూ నెరవేరి
అన్ని శక్తులూ ఒకటిగా చేరి
అనుకూల విజయాలు వరించే

అపురూపమైన అరుణోదయానికి

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు