సంఘసంస్కర్త రాజా రామ్మోహనరాయ్ ;- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)విశాఖపట్నం
 అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలు
ప్రగతికి నిరోధకాలని
స్త్రీ జనోద్ధరణకు ప్రాధాన్యత నిచ్చి
అందరికి చదువు అవసరమని
సతీ సహగమనమనే
అత్యంత అమానుష ప్రక్రియకు
విరోధముగా ప్రజలకు ప్రేరణనిచ్చి
జన్మనిచ్చిన తల్లిదండ్రులు వ్యతిరేకించినా
తన సంస్కరణలకు
ప్రాధాన్యత నిచ్చి
సమాజాభివృద్ధికి శాస్త్ర సాంకేతికతకు
ఆంగ్లభాష ఆవశ్యకతను తెలిసికొని
దేశంలో  ఆంగ్ల పాఠశాలను స్థాపించి
వితంతు వివాహాలను ప్రోత్సహించి
స్త్రీ సాధికారికత గురించి 
మూడు శతాబ్దల క్రిందటే పోరాడిన సంఘ సంస్కర్త
విగ్రహారాధనకు వ్యతిరేకంగా
పశుబలులను వ్యతిరేకించి
బ్రహ్మసమాజ్ ను స్థాపన చేసి
అణగారిన ,ఆర్తుల ,దీనుల కొరకు జీవితమంతా కృషి చేసిన మహానీయుడు రాజారామ్ మోహన్ రాయ్
రాజా అన్న బిరుదు, ఆధునిక భారతదేశ పితామహుడు, పయనీర్ ఆఫ్ ఇండియా అన్న బిరుదులకే వన్నె తెచ్చిన
మీరు యుగకర్తయే
అందుకోండి మీకివే నా అక్షర కుసుమాలు...!!
.........................
(మే 22 సంఘ సంస్కర్త రాజా రామ్ మోహన్ రాయ్ జయంతిసందర్భంగా)
.

కామెంట్‌లు