త్రిపథ! అచ్యుతుని రాజ్యశ్రీ
 త్రిపథ అంటే ఏమిటి అని మనకు సందేహం వస్తుంది కదూ? గంగానది కాపేరుంది.హిమవంతుడు  ఆయన భార్య మనోరమ లకు ఇద్దరు కూతుళ్లు.పెద్దామెగంగ స్వర్గం లో దేవనదిగా ప్రవహిస్తూ ఆపై భూలోకం నుంచి పాతాళంలోకి ప్రవేశించింది కాబట్టి త్రిపథ అనేపేరు వచ్చింది.ఈగంగామాతను గూర్చి విశ్వామిత్రుడు రాముడికి వివరించాడు.హిమవంతుని రెండో కూతురు ఉమ పెళ్లి శివుని తో జరిగింది.100 దివ్య సంవత్సరాలు గడిచినా వారి కి పిల్లలు పుట్టలేదు.శివతేజస్సుని కాసేపు భరించిన భూమి పై పార్వతికి కోపం వచ్చింది.ఆమె దేవతలను కూడా శపించింది." మీకు సంతానం కలగదు.మీ అంశతో మానవులు సంతానం పొందుతారు." అంతే దఏవతలఉ33కోట్లుగానే మిగిలారు శాశ్వతం గా.ఇక భూమి ని శపించింది పార్వతి " నాకడుపున పడాల్సిన శివతేజస్సుని నీవు భరిస్తానన్నావు.నీఆకారం ఉనికి ఒకేరకంగా ఉండవు.ఎత్తుపల్లాలు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఇసుక తో నిండి ఉంటావు.రాజుల్ని అంతా భూపతి అనే పిలుస్తారు.తండ్రి భూపతి.అతను చనిపోతే సింహాసనం ఎక్కు కొడుకు ని కూడా భూపతి అనే పిలుస్తారు" అని దూషించింది.ఇక అక్క గంగ శివతేజస్సుని భరించటం కూడా పార్వతి కి కోపం కారణం ఐంది.గంగ శివతేజస్సుని భరించలేక హిమాలయ పర్వతాలకి పక్కన విడిచిపెట్టడంతో బంగారం వెండి రాగి మొదలైన ఖనిజాలు గనులు ఏర్పడ్డాయి.ఇక విశ్వామిత్రుడు ‌తన అక్క కౌశికీ నదిగా ప్రవహిస్తోంది అని గొప్పగా చెప్పాడు."రామా! నా అక్క అసలుపేరు సత్యవతి.కానీ ఆమె నదిగా మారింది" అని నదులు గంగ మహత్తుని విశ్వామిత్రుడు రాముడికి వర్ణించి చెప్పాడు.దీని అంతరార్థం ఏమంటే మనం నదులు వాటి పరిసరాలు పరిశుభ్రంగా పవిత్రంగా కాపాడాలని తెలియజెప్పటమే.🌸

కామెంట్‌లు