రామావతారం సమాప్తం! అచ్యుతుని రాజ్యశ్రీ

 అందరికీ శ్రీ రామ పట్టాభిషేకం దాకా బాగా తెలుసు.కానీ అవతార సమాప్తి నేటి పిల్లలకి తెలీదు.ఇందులో ముఖ్యపాత్రధారులు కోపిష్టి దుర్వాస మహర్షి లక్ష్మణుడు.రాముడు 11వేలసంవత్సరాలు‌ సత్యధర్మ పాలన సాగించాడు.బ్రహ్మ ఆదేశంతో కాలపురుషుడు ముని రూపంలో రాముని దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు " నేను నీతో ఏకాంతంగా మాట్లాడాలి.లోపలికి ఎవరైనా వస్తే వాడిని చంపేయాలి" అని షరతు పెట్టాడు.అలాగే అన్నాడు రాముడు.తను చెప్పినది తు.చ.తప్పకుండా పాటించేవాడు తమ్ముడు లక్ష్మణుడు ఒక్కడే అని ఆయన నమ్మకం." తమ్ముడూ! నేను ఈముని ఏకాంతంగా మాట్లాడాలి.లోపలికి ఎవర్నీ రానివ్వకు.వచ్చినవాడికి మరణశిక్ష" అని చెప్పాడు.అలా ద్వారపాలకునిగా ఉన్న లక్ష్మణుని దగ్గరకు దుర్వాస మహర్షి వచ్చి " నేను రాముని కల్సుకుని తీరాలి.లేకుంటే మీ అందరినీ శపిస్తా రాముని తో సహా!" అని అంటాడు.సరిగ్గా అప్పుడే లోపలున్న ముని" రామా! నీవింక వైకుంఠం కి వచ్చేయాలి.బ్రహ్మ నాచేత కబురు పంపించాడు" అనగానే " సరే" అన్నాడు రాముడు.లక్ష్మణుడు తలుపుతోసుకుని లోపలికి వచ్చి " అన్నా! దుర్వాస మహర్షి నిన్ను వెంటనే కలవాలి అని నన్ను బలవంతంగా పంపాడు" అని చెప్తాడు." రామా! నాకు విపరీతమైన ఆకలి వెంటనే విందుభోజనం పెట్టు" అని ఆజ్ఞాపించాడు.ఆపై సుష్టుగా తిని తిని దోవన తాను వెళ్ళిపోయాడు.రాముడు బాధపడుతూ" నా మాటను లెక్క చేయకుండా నీవు లోపలికి వచ్చావు.నాచేతులతో చెప్పలేను.నీమొహంచూడను మాట్లాడను. ఇదే నా శిక్ష" అనడంతో లక్ష్మణుడు సరయూనదీతీరంలో ఊపిరి బిగబట్టి ప్రాణం వదిలాడు.దేశబహిష్కరణ శిక్ష కన్నా ప్రాణత్యాగం మిన్న‌ఆని భావించాడు ఆఆదర్శ‌తమ్ముడు
విరక్తి తో రాముడు లవకుశులకు రాజ్యం పంచి భరతశత్రుఘ్నలతో కల్సి సరయుతీరంచేరి. నదిలోకి ప్రవేశించి అవతార సమాప్తి గావించారు.ఎప్పటికైనా మృత్యువు తప్పదు.కానీ బ్రతికి ఉన్న నాళ్లు  నీతి న్యాయం ధర్మం తో జీవించాలి అని రామకథ చెప్తుంది 🌷
కామెంట్‌లు