భరోసా.....! - కోరాడ నరసింహా రావు
 యాభై యేళ్ల సహచరి..... 
  రుణ0 తిరి పాయినదని.... 
  వీడి  పోయింది...! 
   నేను ఆడ పిల్లనే గానీ... 
  ఈ డ  పిల్లను కాను కదాని
   కూతురు అత్తారింటికి.. 
     తరలి పోయింది...! 
  ప్రయోజకు డైన కొదుకు
  సొంత రెక్కల కష్టాన్నినమ్ముకుని... 
 విదేశాలకు వలస వెళ్లిపోయాడు...! 

ఊహ తెలిసిన దగ్గర నుండి
 చదువు... ఉద్యోగము... 
  వివాహము.. సంతానము
  బరువులు... బాధ్యతలు... 
 ఆలసి - సొలసిన ప్రాణం... 
  ఏడు పదుల వయసులో... 
 విశ్రా0తిని , ప్రశా0తను... 
  కోరుకుం టో0ది...!! 

నా న్న...  మీరు కని, పెంచి, ప్రయోజ కుడ్ని చేసిన మీ కొదుకును... నేనుండగా... 
 మీకిదే0 కర్మ...! 
 మీరూ మాతో పాటే... 
 రండి... వచ్చేయండి...! 
  కొడుకు  ప్రేమాభి మానాలు!! 

నిజమే... జీవితానికి ఈ వయసులో... 
  భరోసా అవసరమే...! 

గానీ... యే బంధా లైనా.... 
 నిలిచేది - గెలిచేది.... 
 ఒకరి స్వేచ్ఛా , స్వాతంత్ర్యా లకు ఇంకొకరు ప్రతి బంధకము
  కానంత వరకే....! 

డెబ్బై ఏళ్ల నిండు జీవితాన్ని
  కాచి, వడబోసిన వాడ్ని... 
  నాకామాత్ర0 తెలియదా...!! 

కని , పెంచా మని... 
 ఇప్పుడు బదిలీ తీర్పించుకో వాలను కోవటానికి ... 
  ఇదేమైనా వ్యాపారమా...!? 
 జీవితం... అది నా బాధ్యత

పెద్దలు నిరాధాారు లైతే... 
  పిల్లల ఆసరా తప్పనిసరే..! 
 నాకే0 కర్మ...! 
  కాలు, చెయ్యిఆడుతున్నాయి
  దర్జాగా బ్రతక టానికి సరిపడా 
     పెన్షన్ వస్తోంది...!! 
 
హక్కులు - బాధ్యతలుఅంటూ
  పిల్లల స్వేచ్ఛకు ప్రతిబంధకాలై
 కూచొటం యేమంత వివేక0... 

అందుకే... అద్దె వసతిలో ఉన్న 
 అనాధాశ్రమానికి తన కష్టార్జితం తో కట్టించు కున్న
 భవనాన్ని యిచ్చేయ టానికే
 నిర్ణ యించుకుని... 
  ఆ పది మందితో కలిసి... 
  కాల క్షేపం చెయ్య టానికే... 
  సంసిద్ధుడైపోయాడు...!! 

జీవిత మంటే...పరుల భరోసా తో బ్రతకటం కాదు.... 
 ఎవరి బ్రతుకుకు వారే... 
  భరోసా కావాలి అంటాడతను
      ********

కామెంట్‌లు