మరుగున పడిన మహనీయులు! అచ్యుతుని రాజ్యశ్రీ
 పేద కుటుంబం లో పుట్టి దేశసేవ సాహిత్య సేవ లో అలసి క్షయవ్యాధిబారిన పడిన ఆయన11ఏప్రిల్1938 లో కన్నుమూశారు. నాల్గులక్షలరూపాయల అప్పులు మిగిలితే అల్లుడు
బాకీలు తీర్చటం కోసం తన ఎస్టేట్ అమ్మి వార్తాపత్రిక ను మామగారి ఆశయాల మేరకు సమర్ధవంతంగా కొనసాగించిన అపూర్వ అల్లుడు  మన తెలుగువారికి
గర్వకారణం.మనవడు కూడా తాత తండ్రి బాటలో నడిచి సాహిత్య సేవ చేశారు.
రైతులను ఆదుకోవాలని జమీందారీ విధానం రద్దు కావాలి అని పోరాడారు.1929 లో రంగూన్ లో జరిగిన తొలి ఆంధ్ర మహాసభ సదస్సు కి అధ్యక్షుడు గా వ్యవహరించి బర్మా తెలుగు ప్రజలు కలిసి కట్టుగా వ్యవహరించాలని సలహా ఇచ్చి ప్రజలమధ్య ఐక్యత సహకారం కోసం కృషి చేసిన మహనీయుడు.1921 లో బర్మాలో 1,50,000తెలుగువారున్నారు.ఒక్క రంగూన్ లోనే60వేలమంది తెలుగు వారు సరైన ఆహారం వసతిలేక నానా అగచాట్లు పడుతుంటే
వారి కై తపించి వెన్నుతట్టి తెలుగు వాడి నాడి వేడి సత్తా చూపిన  ఆమహనీయుడుతల్లిపేర బడినెలకొల్పిఉచితవిద్య తో పాటు 40ఇళ్లు కట్టి హరిజనులకి దానం చేశారు.ఆయన దాతృత్వం 
ఔదార్యం నభూతో నభవిష్యతి.గుప్తదానాలతో‌ కరిగిన కొవ్వొత్తి.గ్రంథాలయాలు దేవాలయాలు మనిషిని మనీషిగా తీర్చి దిద్దుతాయి అని ఆయన నమ్మకం విశ్వాసం.మరి ఆమహామనీషి ఎవరో మీకు తెలిసిపోయి ఉంటుంది కదూ?ఆమూడు తరాల వారు ఎవరో?!
దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు.తన ఏకైక కుమార్తె కామాక్షమ్మ పెళ్లి శివలెంకశంభుప్రసాద్ గారి తో జరిపించారు.మామకు తగ్గ అల్లుడు.ఈదంపతుల కుమారుడు శివలెంకరాధాకృష్ణగారు.

కామెంట్‌లు