శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
716)అపరాజితః -

అపజయం ఎరుగనట్టివాడు 
ఓటమినెపుడు పొందనివాడు 
పరాజితుడు కానట్టివాడు 
సదా విజయుడైయున్నవాడు 
 శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
717)విశ్వమూర్తిః -

విశ్వమే తనమూర్తిగా గలవాడు 
భువనములను నిండినవాడు 
లోకాకృతిని పొందియున్నవాడు 
విశ్వరూపము చూపించువాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
718)మహా మూర్తి-

గొప్ప ఆకారము గలిగినవాడు 
భారీతనము యున్నట్టివాడు 
గొప్ప విగ్రహముగా నున్నవాడు 
మహా మూర్తివంతుడైనవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
719)దీప్తమూర్తిః -

జ్ఞానముతో ప్రకాశించుచున్నవాడు 
సంపూర్ణ తేజస్సు గలిగినవాడు 
దీప్తిని పొందియున్నట్టివాడు 
భాసించు మూర్తిత్వము గలవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
720)అమూర్తివాన్ -

కర్మాధీన శరీరము లేనివాడు 
అదృశ్యముగా  నుండినవాడు 
కనులకు గోచరించనట్టివాడు 
ఎటువంటి మూర్తిత్వము లేనివాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు