మొక్కవోని పట్టుదల - వోని పాఠశాల

 తన ముప్పదైదేండ్ల సర్వీసులో పది పాఠశాలలందు పనిచేయగా, అందులో మిక్కిలి సంతృప్తినిచ్చిన పాఠశాల వోని పాఠశాలేనని, ఆ పాఠశాల నుండి బదిలీ కాబడిన జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు అన్నారు. గతేడాది జూన్ 9న, 
రాజాం మండలం కొత్తవలస యుపి పాఠశాల సాంఘిక శాస్త్రోపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులైన 
కుదమ తిరుమలరావు, ప్రభుత్వం చేపట్టిన బదిలీలనందు కొత్తూరు మండలం కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బదిలీ ఐనారు. అక్కడ నాలుగు నెలలపాటు పనిచేస్తుండగా, తాత్కాలికంగా వర్క్ ఎడ్జిస్ట్ మెంట్ డెప్యుటేషన్ బదిలీపై పాలకొండ మండలం వోని యు పి పాఠశాలలో నియమించబడ్డారు. ఆరున్నర నెలల పాటు వోని లో పనిచేసిన అనంతరం, వర్క్ ఎడ్జిస్ట్ మెంట్ లు రద్దు కావడంతో తిరుమలరావు, తిరిగి యథాస్థానమైన కడుము పాఠశాలకు చేరుకున్నారు. ఐతే, తన ఆరున్నర నెలల వోని పాఠశాల అనుభవాలు మధురస్మృతులను మిగిల్చాయని తిరుమలరావు వివరించారు. 
ప్రధానోపాధ్యాయని 
బలగ నాగమణి, 
ఉపాధ్యాయులు పాలవలస శారదాకుమారి, 
గోగుల సూర్యనారాయణ, 
దానేటి పుష్పలత, 
సిద్ధాబత్తుల వెంకటరమణలు తన అభ్యుదయ భావాలను ఎంతగానో గౌరవించారని కృతజ్ఞతాపూర్వకంగా అన్నారు. 
తనతో పాటు గుణాత్మక విద్యాసాధనలో వారి కృషి మిక్కిలి అభినందనీయమని కొనియాడారు. తాను రోజూ సాయంత్రం నిర్వహించిన అదనపు తరగతులను
పాఠశాల విద్యార్థులంతా శ్రద్ధగా విని, సహకరించి, పాఠ్యాంశాలలో వెనుకబడియున్న అంశాలను అభ్యసించారని తిరుమలరావు అన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'తానా' వారు చేపట్టిన శతక పద్యార్చనలో తన ప్రోత్సాహంతో 8వ తరగతి విద్యార్థిణి సాహుకారు సాయివర్ష విజేతగా నిలిచి, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసాపత్రం సాధించిందని, సాయివర్షతో పాటు ప్రోత్సాహకుల పేరిట ఉపాధ్యాయులందరూ కూడా ప్రశంసాపత్రాలు పొందారని ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు. 
ప్లాస్టిక్ బాటిల్స్ కాకుండా విద్యార్థులంతా స్టీల్ బాటిల్స్ వాడకాన్ని నెలకొల్పగా శతశాతమూ తల్లిదండ్రులంతా బాధ్యతతో స్పందించి, సహకరించారని తిరుమలరావు అన్నారు. 
రాష్ట్ర విద్యా శాఖ నిర్దేశించిన విషయాలను పాలకొండ ఎంఈఓ పర్రి కృష్ణమూర్తి వెబెక్స్ ద్వారా ఉపాధ్యాయులందరికీ తెలియజేయగా, తిరుమలరావు వింటూనే ఆ మార్గదర్శక సూత్రాలను ముప్పది అంశాలుగా రూపొందించి ఉపాధ్యాయులందరికీ చేరవేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్స్ వాట్సప్ గ్రూపులకు సదరు అంశాలను విస్తృతపర్చడంతో,
పాలకొండ మండల ఉపాధ్యాయుల అభిమానం చూరగొన్నానని తిరుమలరావు తెలిపారు. ఎంఈఓగా పనిచేస్తున్న పర్రి కృష్ణమూర్తికి పాలకొండ డివిజన్ ఉప విద్యాశాఖాధికారిగా పదోన్నతి పొందిన సందర్భంలోను, 
వోని పాఠశాల ఉపాధ్యాయులు గోగుల సూర్యనారాయణ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందిన సందర్భంలోను
ఇరువురికీ అభినందన గీతాలు రచించి ఆలపించడం తనకు లభించిన గొప్ప అవకాశాలని తిరుమలరావు తన సంతృప్తిని వ్యక్తం చేసారు. 
డెప్యూటీ డీఈవో పర్రి కృష్ణమూర్తి, ఎంఈఓ కురిటి సోంబాబులిరువురూ వెంకంపేట యుపి పాఠశాలకు ఇన్సెపెక్షన్ కి వెళ్ళినపుడు, వారితోపాటు తనను కూడా తనిఖీ బృంద సభ్యునిగా ఎంపిక చేసి, తొలిసారిగా కొత్త బాధ్యతను నిర్దేశించారని, అదొక గొప్ప అదృష్టంగా భావించి సద్వినియోగపర్చుకున్నానని
తిరుమలరావు ఆనందం వ్యక్తం చేసారు. 
పాలకొండ, వీరఘట్టం రెండు మండలాల పరిధిలో తలవరం సాంఘిక శాస్త్ర విషయ పాఠశాల సముదాయానికి, వోని సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా హాజరై డాక్యుమెంటేషన్ లను రూపొందించానని, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నానని ఇందుకు స్కూల్ కాంప్లెక్స్ ఛైర్మన్ ఉప్పాడ అప్పారావు, రెండు మండలాల ఎస్ ఎస్ టీచర్ల ప్రోత్సాహం మరువలేనిదని తిరుమలరావు తన కృతజ్ఞతలను చాటుకున్నారు. తలవరం స్కూల్ కాంప్లెక్స్ ఎ.పి.ఎస్.ఎస్.టి.ఎఫ్. నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయగా, అందులో తనను జాయింట్ సెక్రటరీగా ఎంపిక చేసిన అధ్యక్షులు మాచర్ల రఘునాథ దొర తదితరులకు తిరుమలరావు ఈ సందర్భంగా మరోసారి ధన్యవాదాలు తెలిపారు. ఇదే సంఘం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సాంఘిక శాస్త్ర బోధనాభ్యసనా సామాగ్రి ప్రదర్శన మేళాలో విద్యార్థులను పాల్గొనేలా చేసి, స్వీయ గీతాలను ఆలపించిన తిరుమలరావు ఘన సత్కారాలు పొందారు. పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఐదుగురు విద్యార్థులకు షీల్డులు, మెడల్స్ ను, పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ బాలబాలికలకు, పేరెంట్స్ కు తిరుమలరావు స్వయంగా జ్ఞాపికలను అందజేసి, ప్రోత్సహించారు. 
ఈ వోని పాఠశాలలో స్లాష్ పరీక్షలు నిర్వహించు నిమిత్తం విచ్చేసిన  జిల్లా స్లాష్ పర్యవేక్షక బృంద సభ్యులు జి.ఎల్.ఎస్.జ్యోతి కుమారి, ఎల్.ఐ.పి. అమలగు తీరును పర్యవేక్షణకై విచ్చేసిన ఎంఈఓ కురిటి సోంబాబు టీమ్, 
వర్క్ బుక్స్ నోట్ బుక్స్ అమలగు తీరును పర్యవేక్షణకై విచ్చేసిన స్కూల్ కాంప్లెక్స్ ఛైర్మన్ సి.హెచ్. సోమేశ్వరరావు టీమ్, లెసన్ ప్లేన్  ప్రాక్టిస్ పీరియడ్ టీచింగ్ పీరియడ్ లు అమలగు తీరును పర్యవేక్షణకై విచ్చేసిన ఎస్ ఎస్ సబ్జెక్టు నిపుణులు బౌరోతు మల్లేశ్వరరావు తదితర విషయ నిపుణుల టీమ్, తర్ల్ టీమ్ గా విచ్చేసిన గోగుల సూర్యనారాయణ తదితరులు సందర్శించే సందర్భాలలో పాఠశాల పనితీరును ప్రశంసించడం గొప్ప అనుభూతినిచ్చిందని తిరుమలరావు అన్నారు. తన సర్వీసులో డెప్యుటేషన్ పై పనిచేసే ఏకైక పాఠశాల 
ఈ వోని పాఠశాల అని, ఈ వోని తనకు 6వ మండలం, 10వ పాఠశాల కాగా, ఈ వోని పాఠశాలలో కేవలం 6నెలల 10రోజులే పనిచేయడం 
కడు ముదావహంబగు విశేషమని తిరుమలరావు తనదైనశైలిలో కవితాత్మకంగా అన్నారు . 
విద్యార్థుల చిత్రలేఖనాలను పలు పత్రికల్లో వచ్చేలా ప్రోత్సహించడం, ప్రోజెక్ట్ వర్క్ లో భాగంగా విద్యార్థులను సచివాలయానికి పంపించి సచివాలయం విధివిధానాల సేకరణ, కొన్ని ఇళ్ళను సెన్సస్ వర్క్ చేయించుట వంటి ప్రోజెక్ట్ వర్క్ లను విజయవంతంగా అమలు చేయుటనందు గ్రామస్థుల, సచివాలయ విద్యా సంక్షేమ కార్యదర్శి ఆర్.కిశోర్, కె.అనూష తదితరుల సహకారం ఘనమైనదని తిరుమలరావు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నేతృత్వాన, వికసిత భారత్ పేరిట డ్రోన్ సాంకేతిక నిపుణులచే రైతుకూలీలకు, యువతకు, మహిళలకు ఈ పాఠశాల ఆవరణలోనే ఇచ్చే శిక్షణ గొప్ప అనుభూతినిచ్చిందని ఆయన అన్నారు. డ్రోన్ లను ఈ వోని పాఠశాల ఆటస్థలంలో నిల్పీ, ఆకాశం వైపు పంపించి, గాలిలో చక్కర్లు గావించి, తిరిగి పాఠశాల ఆటస్థలంలోకి తెచ్చి 
పంటపొలాల్లో ఎరువులను, పురుగుల మందును తక్కువ సమయంలో ఎలా చల్లాలో తెలియజేసే ప్రయోగాత్మక సన్నివేశాలు ఈ వోని పాఠశాలలో మరో తీపి గురుతులని తిరుమలరావు తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. తనచే పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్కూల్ అసెంబ్లీలో ముఖ్య అతిథి ప్రసంగం చేసేందుకు, వెంకంపేట యుపి పాఠశాల స్కూల్ అసెంబ్లీలో దేశభక్తి గీతాన్ని ఆలపించేందుకు ఆహ్వానించిన సదరు పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా మిక్కిలి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తిరుమలరావు అన్నారు. తాను వోని పాఠశాలనుండి బదిలీ అయిన సందర్భంలో తనపై ఎంతో అభిమానంతో ఘనంగా సన్మానించి, వీడ్కోలు పలికిన ఉపాధ్యాయుల విద్యార్థుల గౌరవాలను జీవితాంతం తన గుండెల్లో పదిలపర్చుకుంటానని తిరుమలరావు కృతజ్ఞతా పూర్వకంగా తెలిపారు.
కామెంట్‌లు