646)త్రిలోకాత్మా -
త్రిభువనముల ఆత్మవంటివాడు
మూడులోకములు ఆత్మ నుంచువాడు
ప్రాణకోటికి ఆత్మనిచ్చువాడు
త్రిలోకాధిపత్యము గలవాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
647)త్రిలోకేశః -
ముల్లోకములకు ప్రభువైనవాడు
విశ్వముకు అధికారియగువాడు
లోకముల శాసించునట్టివాడు
సర్వభువనములనేలువాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
648)కేశవః -
దీర్ఘకేశములు గలిగినవాడు
ఘనమైన శిరోజములున్నవాడు
విష్ణుమూర్తి అవతారమున్నవాడు
మంచి వెండ్రుకలున్నట్టివాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
649)కేశిహాః -
కేశియసురుని గూల్చినవాడు
దివ్యత్వము చూపించువాడు
ఇతిహాసమునున్నట్టి వాడు
అసురప్రకృతిని గూల్చువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
650)హరిః -
అజ్ఞానము హరించివేయువాడు
సంసారదుఃఖము తొలిగించువాడు
కర్మజనిత బాధలు తీర్చువాడు
హరియై వైకుంఠమునున్నవాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి