రాజాం గ్రీనరీకై సన్నాహక సమావేశం

 తొలివిడతగా వెయ్యి మొక్కలు నాటి, వెయ్యి వృక్షాలుగా చేసేందుకై సన్నాహక సమావేశం ఏర్పాటు చేసామని రాజాం పర్యావరణ సంరక్షణ సమితి కన్వీనర్ ఆర్.వి.జె.నాయుడు తెలిపారు. 
స్థానిక సూర్య దుర్గా కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన రాజాం పట్నంలోను, రాజాం చుట్టు పక్కలా ప్రజలు ఉక్కపోత సమస్యతో అల్లాడిపోతున్నారని, అందువలన చెట్లు చాలా అవసరమని గుర్తించి పరిష్కార దిశగా కృషి చేయుటకు అందరూ సహకరించాలని కోరారు. 
తొలుత పెంకి గౌరీశ్వరరావు  నేలతల్లికి వందనం మడిచేల తల్లికి వందనం అనే ప్రార్ధనా గీతాన్ని ఆలపించి సభను ప్రారంభించారు.
హాజరైన రాజాం ప్రముఖులు తగు వ్యూహ రచన గావించారు. ఆకిరి రామారావు పూలమొక్కలకు ప్రాధాన్యతనివ్వాలని, మక్క అప్పలనాయుడు ప్లాస్టిక్ నిషేధంపై దృష్టి సారించాలని, గార రంగనాథం సమీపంలో ఉన్న ఇంటి యజమానికి మొక్కల పెంపకం బాధ్యత వహించేలా చూడాలని, కొత్తా సాయిప్రశాంత్ కుమార్ రహదారుల కిరువైపులా మొక్కలు నాటుటకై ప్రాధాన్యతనివ్వాలని, గార రవి ప్రసాద్ పెరగగల్గు ప్రదేశాన్ని గుర్తించాకే మొక్కలు నాటాలని, మజ్జి మదన్మోహనరావు భూమినుండి వేడి సెగలను పైపైకి వెళ్లనీయకుండా ఆపే బరువైన కార్బన్ డై ఆక్సైడ్ వాయువును అరికట్టాలంటే మొక్కలు నాటాలని అన్నారు. కుదమ తిరుమలరావు చెట్లు పెంచుదాం లాభాల్ని పంచుదాం చెలిమి కలిమిలిచ్చే మొక్కల్ని చాటుదాం అంటూ స్వీయగీతాన్ని ఆలపించారు. 
ఈనాటి సమావేశంలో పాలవలస శ్రీనివాసరావు, శాసపు సత్యనారాయణ, సీమకుర్తి ప్రసాదరావు, పెంకి గౌరీశ్వరరావు, బి.వి.అచ్యుత కుమార్, పెంకి చైతన్య కుమార్, వడ్డి ఉషారాణి, లక్ష్మీ భాను, కల్యాణి, సురేష్, కొండవలస మధుసూదనరావు, డోల వాసుదేవరావు, వారాడ వంశీకృష్ణ, మంతపూడి ప్రసాదరావు, మువ్వల రమేష్, బెవర శ్రీనివాసరావు, శెట్టి శివరావు, వంజరాపు ఈశ్వరరావు, ఈశర్ల మురళి, గుడ్ల భారత్, ఉల్లాకుల నీలకంఠేశ్వర యాదవ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఈ కార్యక్రమ అమలుకై వివిధ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది.
కామెంట్‌లు