కవనప్రపంచం- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కవనప్రపంచం
పిలుస్తుంది
కవనచైతన్యం
కలిగిస్తుంది

కవనమాధుర్యాన్ని
క్రోలుకోమంటుంది
కవనస్వర్గాన్ని
చేరుకోమంటుంది

కవనలోకాలను
కాంచమంటుంది
కవనసౌందర్యాలను
తిలకించమంటుంది

కవనకిరణాలను
స్వీకరించమంటుంది
కవనసౌరభాలను
ఆస్వాదించమంటుంది

కవనలోతులకు
వెళ్ళమంటుంది
కవనమర్మాలను
కనుగొనమంటుంది

కవనసుధలను
పుచ్చుకోమంటుంది
కవనసుమాలను
పరికించమంటుంది

కవనవీరులను
కొనయాడమంటుంది
కవనకన్యలను
వరించమంటుంది

కవనకౌముదిలో
విహరించమంటుంది
కవనసేద్యంలో
కొనసాగమంటుంది

కవనగిరులను
వీక్షించమంటుంది
కవనశిఖరాలను
అధిరోహించమంటుంది

కవనారణ్యంలో
సంచరించమంటుంది
కవననీడలలో
స్వేదతీరమంటుంది

కవనసామ్రాజ్యమును
స్థాపించమంటుంది
కవనాభిమానులను
పరిపాలించమంటుంది


కామెంట్‌లు