బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ;- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్విశాఖపట్నం
 సామాజిక స్పృహే ధ్యేయంగా సాహితీ సేవలో 
తెలుగు జాతి దశా- దిశా నిర్దేశించిన సురవరం ప్రతాపరెడ్డి పరిశోధకుడిగా, పండితుడిగా, రచయితగా, క్రియాశీలక ఉద్యమకారుడిగా నిరంతర సేవచేసిన సరస్వతీ పుత్రులు...!!
గోల్కొండ కవుల సంచిక గ్రంధాన్ని మూడువందల ఏబది మంది కవులచే వ్రాయించి తెలంగాణా కీర్తిని వసుదైక సాహితీకుటుంబానికి చాటిన వైతాళికుడు...!!
తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, పారసీ మరియు ఆంగ్లభాషల నిష్ణాతులై,భారతీ సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికల సంపాదకులు గా రచయితగా, ఆంధ్ర గ్రంధాలయ మహాసభకు అధ్యక్షునిగా, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షునిగా సాహితీసేవ చేసిన మీకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
' ఆంధ్రుల సాంఘిక చరిత్ర' 
గ్రంధానికే  వన్నె తెచ్చిందనుట లో సందేహం లేదు.
మొగలాయి  కథలు భక్త తుకారం నాటకం వంటివి మీ ప్రతిభకు ప్రామాణికం
మీ గౌరవ సూచకంగా ట్యాంకుబండ్ పై విగ్రహ ప్రతిష్ఠ  బహుముఖ ప్రజ్ఞకు
ప్రతీక అందుకోండి  తెలుగు వారి శతకోటి వందనములు...!!
............................
ఇది నా స్వీయ వచన కవిత. ప్రచురణార్ధం వ్రాసినది
కవిమిత్ర, సాహిత్యరత్న
............................

కామెంట్‌లు