సుప్రభాత కవిత; - బృంద
అరుదైన అవకాశం
అందుకోవాలి...
అదును చూసి అడుగు
ముందుకే వేయాలి

బెదిరించని అడ్డంకులు
అదిలించని అధికారాలు
తొలగి దారులు ఇచ్చే
బంగారు క్షణాలు రావాలి

అందుకునే విజయాలకు
ఆనందాల కేరింతలు కొట్టే
అపురూప సమయమేదో
ఆసన్నమవుతోంది.

వేగంగా దూరమంతా
కరుగుతూ తరుగుతోంది
ఆశించిన తరుణమేదో
ఎదురుగా వేచి నిలిచింది

అడుగులకు ఆనందం తోడై
నాట్యంగా తోస్తోంది
అణచుకున్న భావమేదో మదిలో
కోలాటం వేస్తోఁది

పొగమంచు మాటున వెలుగు
పొంచి చూస్తూ ఉంది
ఆగలేక  అల్లరి మనసు
పరుగులు తీస్తోంది.

ఊహలు వాస్తవాలవుతుంటే
ఉత్సాహం ఉఱకలు వేసి
ఉప్పెనలా ముంచేస్తూ
ఉదయానికి స్వాగతమంటోంది

వేచిన వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు