శ్రీశ్రీ;- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
 శ్రీశ్రీ
రెండక్షరాల పేరు 
నింగీనేలను ఏకంచేసిన భావాభ్యుదయవిప్లవ కవితా పైరు
తెలుగు కవిత్వాన పారే అగ్నిసెలయేరు
'ఈ శతాబ్దం నాది'అంటూ గర్జించిన కలం 
మరో ప్రపంచం అంచుల ధ్వనిస్తున్న కవిత్వం
కవిత్వం ఆశగా శ్వాసగా అక్షర వైదానంలో ఆడిపాడిన కలం 
హలాల దున్నిన పొలాల హేమం నిండే
ఇలాతలంలో  కష్టజీవి చిందించిన స్వేదం
జాతికి ఆకలిదప్పులు దీర్చిన ఔషధం 
కవిని ప్రేమమీర గౌరవించిన స్నేహవాస హితవరి 
వైవిధ్య యుగళ గీతం పాడిన జాబిలి జ్వాల
వివిధ రోగాలపై యుద్ధం చేసిన సాహస కలధారి
తెలుగు అక్షరాలూ తెలుగు కవిత్వం బతికిన బతుకుతున్న బతికే ప్రతి కాలంలోనూ బతికుండేదే శ్రీ శ్రీ కవిత్వం.
ఒక లయ ఊపు శబ్దం చలనం నడక గమనం కొత్తదారులు నడిచే విప్లవ విపంచి
భూమార్గం పట్టించిన స్వేచ్ఛను ఆకుపచ్చ కొలనులో ఈదే చేప ఊపిరి స్వతంత్రతను ఆవిష్కరించిన అక్షరాగ్ని కణం శ్రీ శ్రీ నవయుగ వైతాళికుడు ప్రపంచ సాహిత్య పుటల్లో.ఒక ఉద్వేగం ఒక ఉద్రేకం ఒక ఆవేశం ఒక ఆలోచన ఉప్పెనగా ఎగిసిన అరుదైన శక్తి. జన సృజన తానై సామాజిక బాధల మోసిన సృజనార్ణవ కవితారుణపిపాసి శ్రీశ్రీ.
-----------------------------------
**(30-4-2024న శ్రీశ్రీ జయంతి)

కామెంట్‌లు
K.Ravindra chary చెప్పారు…
ఇది ఒక హృదయ పూర్వకమైన ట్రిబ్యూట్. భాష, భావాలు బావున్నాయి. కవి శ్రేష్టుడికి వందనములు 🙏🙏