సుప్రభాత కవిత - బృంద
దోబూచుల వెలుగుల
సరదాల ముచ్చట్లు
ఆడ్డొచ్చే మబ్బులకేమో
అలవికాని ఆత్రాలు

అఖిల జగతీ ఎదురుచూసే
అరుణోదయపు క్షణాలు
అగుపించక ఆటలాడె
అవనితో ఆదిత్యుడు

అలలలోన అలజడులై
అంబుధిలో ఆవరించి
అంతులేని ఆరాటమేదో
ఆపలేని కెరటమాయె!

అడ్డంకులెన్ని వచ్చినా
అవరోధాలెదురైనా
అవధిలేక వెలుతురేమో
ఆవరించె లోకమంతా

ఆశించే ఆకాంక్షలు
అరచేతిలో ప్రసాదించి
అంతులేని వేదనలన్నీ
అంతం చేసి  అలరించే

అద్భుతమైన వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు