జీవ వైవిధ్యాన్ని పరిరక్షిద్దాం;- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)విశాఖపట్నం
 ఇంటి ముందు పచ్చని చెట్లు
విశాలమైన అరుగులో వాలుకుర్చీలో కూర్చుని
రాముడు తాతయ్య ఊరివారికిచ్చే సలహాలు
నడి వాకిట్లో వసారాలో వేలాడే వరికంకులు తింటు చిన్ని చిన్ని రెక్కలతో ఎగురుతు
పిచ్చుకలు చేసే కిచ కిచారావాలు
పెరట్లో జామి, మామిడి, దానిమ్మ, కొబ్బరి చెట్లపై
కాకులు, పచ్చని చిలుకలు, గోరువంకలు చేసే స్వరాలు
చైత్రంలో కోయిలల కుహూ కుహూ రావాలు
ఇక మల్లి, చామతి, బంతి, మందార పువ్వులపై  వాలే
సప్తవర్ణపు సీతాకోక చిలుకలు
సాయంత్రం పూట తోటలో తిరిగే కుందేళ్లు
అప్పుడప్పుడు కనిపించే  నాగదేవతలని చెప్పే పాములు,వాటికొరకు వచ్చే ముంగిసలు
పొలం పక్క చెరువులో రంగురంగుల  చేపలు, తాబేలు 
రాత్రి పూట కనిపించే గుడ్ల గూబలు, నక్కల ఈలలు
గుబురు తోటలో కనిపించే లేడి, దుప్పులు
ఎన్నని, ఏమని చెప్పను ఎన్నో, ఎన్నెన్నో జీవరాశులు మనతో మమేకమై జీవించి
పచ్చటి ప్రకృతి సంపద
నేడు బహుళ అంతస్థుల భవనాలు, సెల్ టవర్స్ తో కనుమరగవడం చూస్తున్నాం
.
భావితరాలకు వాటి ఉనికి చెప్పుటకై మే22 అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం గా ప్రపంచ దేశాలన్ని జరుపుకుని
అంతమవుతున్న జీవరాశి పరిరక్షణ మన బాధ్యత అని తెలియచేసే రోజు 
జీవరాశి,ప్రకృతి పరిరక్షణ చేసి అంతరించే జీవ, వృక్ష సంపద కాపాడుకొని
పూర్వ వైభవాన్ని పొంది భావితరాలకు మార్గదర్శకులవుదామని ప్రతిన పూనుదాం...!!
.............................
( మే 22వ  తేది అంతర్జాతీయ  జీవవైవిధ్య దినోత్సవం సంధర్భంగా)
...............................

కామెంట్‌లు