ఊయలూగే పూలలో
ఉప్పొంగే ఆనందమెంతో!
గాలితో పూల గుసగుసల
రహస్యమేంటో!
మలయానిలపు స్పర్శ తాకిన
పరిమళాల పరవశమెంతో!
పంచిపెట్టాలని పరుగుతీసే
పవనాల సంబరమెంతో!
వెన్నెలలో తడిసిన సుమాలు
వెచ్చగా వెల్లడించే ముచ్చట్లేమిటో!
తెల్లవారి వెలుగులో
వెల్లివిరిసే ఉత్సాహమెందుకో?
మగతనిదురలో కన్న కలల
మధురానుభూతుల మర్మమేమిటో?
మంచి పంచే మనసుకి
మాయలు తెలియవెందుకో?
చిక్కులు తొలగించు చక్కని
వేకువ కొత్తగ తెచ్చే సంతోషమేమిటో!
కమ్మని కబురేదో తెస్తున్న
ఉదయానికి ....
🌸🌸 సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి