త్యాగరాజు ;- కె.కె. తాయారు.

 మే,4,1767_  (జననము)
జనవరి,6,1847(_మరణము)
   కర్ణాటక  సంగీతంలో త్రిమూర్తులలో త్యాగరాజ బ్రహ్మ ఒకరు. ఈయన చాలా ప్రసిద్ధులు. 
నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన వాగ్గేయకారుడు. 
                ఆయన శ్రీ శ్రీరామచంద్రుని నమ్ముకుని మనసా వాచా ఆయన మీద భక్తి ప్రపత్తులతో నాదోపాసన చేసేవారు. అందువలన కీర్తనలన్నీ శ్రీరాముని పైనే రాశారు. ఆయనకున్న విశేష భక్తిని వేదాలపై ఉపనిషత్తులపై జ్ఞానాన్ని తెలియ పరుస్తాయి .
ఉపనయనం తర్వాత తండ్రి గారి బోధలు. 18వ ఏట!రామకృష్ణానంద పరబ్రహ్మ ఉపదేశం చేసిన రామ సడాక్షరి మంత్రం ప్రభావం, తల్లి నేర్పిన భక్తి సంగీతాలు, బాల్యంలోనే బీజంకురాలై , త్యాగరాజ స్వామి వారిలో మూర్తిభవించాయి.
             కవిత్రయంలో ఒకరు వారిని వాగ్గేయకారులు అందరు. తమిళనాడు కి చెందిన తంజావూరు జిల్లా తిరువారూరుకు చెందిన వారే. తమిళనాడులో పుట్టిన పెరిగిన వారి గానం ఎక్కువగా తెలుగు సంస్కృత భాషల్లో సాగింది.    
                     ******

కామెంట్‌లు