నమ్ము నమ్మకపో! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఇండియన్ రోప్ ట్రిక్ మనం విన్నాం.కానీ ప్రత్యేకంగా చూడలేదు.ఎన్నో శతాబ్దాలతరబడి ఇది మిస్టరీ గా మిగిలిపోయింది.ఒకత్రాడుని గాల్లోకి విసిరేసి దాన్ని కర్రలాగా నిటారుగా నిల్చోబెడ్తారు.ఓచిన్న కుర్రాడు చకచకా దాని కొసదాకా ఎక్కి మాయం అవుతాడు.కిందనించున్న పెద్ద వాడు చూస్తూ ఉండగా ఆకుర్రాడిని చేరగానే వాడు ముక్కలుగామారి కింద పడతాడు.ఆపెద్దతను రక్తం కారుతూ ఉన్న కత్తితో కిందకి దిగి మాజిక్ మంత్రాలు 
చదువుతూ ఉండగా తాడు కింద పడిపోతుంది.అతను పిల్లాడి తునాతునక లైనశరీరభాగాల్ని ఒక మూటలా కట్టిఉంచుతాడు.
కొన్ని సెకండ్ల లో ఆపిల్లాడు ఎంచక్కా పూర్తి గా నవ్వుతూ లేచి బైటికొస్తాడు.600ఏళ్లక్రితమే మనదేశంలో ఈట్రిక్ ఉన్నట్లు  యాత్రికులు వర్ణించారు.
కామెంట్‌లు