పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలి -ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య

  ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని  తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య కోరారు. శనివారం ఆయన పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన రూ. 1.9 లక్షల వ్యయంతో పాఠశాలలో జరుగుతున్న అమ్మ ఆదర్శపాఠశాల అభివృద్ధి పనులను ఏపీఎం కనుకయ్య, పాఠశాల చైర్ పర్సన్ ఓరుగంటి శ్రీజ, కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాల సమావేశంలో ఈర్లసమ్మయ్య మాట్లాడుతూ ఉన్న ఊరు కన్నతల్లి లాంటి ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పిల్లల తల్లిదండ్రులు ఇతర పాఠశాలల మోజులో పడి తమ కష్టార్జితాన్ని వృధా చేసుకోకూడదని, ఫీజుల రూపంలో ప్రతి ఏటా చెల్లించే లక్షలాది రూపాయల్ని బ్యాంకులో వారి పేరున జమ చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ప్రతి ఏటా కోట్లాది రూపాయల ప్రజాధనంతో ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, 2 జతల డ్రెస్సులు, నోట్ బుక్కులు, వారి ఆరోగ్య పరిరక్షణకు సీఎం బ్రేక్పాస్ట్, రాగి జావ, సన్న బియ్యంతో శుచి, రుచికరమైన మధ్యాహ్న భోజనం, వారానికి 3 కోడిగ్రుడ్లు అందిస్తోందన్నారు. కార్యక్రమంలో పాఠశాల చైర్ పర్సన్ ఓరుగంటి శ్రీజ, పిల్లల తల్లిదండ్రులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు