'హరీ!'శతకపద్యములు.;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 104.
చంపకమాల.
వినవలె నీదు లీలలను వీనుల విందుగ ముక్తసంగులై
కనవలె నీదు రూపమును కాంచిన దీరు నఘంబులయ్యెడన్
జనవలె నీదు సన్నిధికి చయ్యన మోక్షము కల్గునే సదా
యనవలె నీదు నామముల నార్తిని బాపుట తధ్యమౌ హరీ!//
105.
ఉత్పలమాల.
కోరను పట్టువస్త్రములఁ  గోరను రత్నపు రాసులన్నిటిన్ 
గోరను స్వర్ణ సౌధములఁ  గోరను హస్తి తురంగ తేరులన్
గోరను రాజ దర్పములఁ గోరితి నీపద ధూళి రేణువుల్ 
కూరిమి తోడ నా కొసగి  కొల్వున దాసిగ జేర్చుమా హరీ!//

కామెంట్‌లు
Malalapragada Rama Krishna చెప్పారు…
ఏమనిచెప్పలేను మనసేవిధిమార్గముమారిపోవుటే
ప్రేమనుపంచగల్గుటసుపాఠ్యమునిత్యముభక్తిగల్గుటే
మామదిసత్యపల్కగుసమానసహాయముయుక్తియవ్వుటే
క్షేమముకోరిసేవలగు కామ్యముకర్తగ సవ్యముహరీ