వీరిది సంప్రదాయకమైన సంగీతం కర్ణాటక సంగీతం అంటారు.
శ్రీ త్యాగరాజు గారు శొంఠి వెంకట రమణయ్య గారి వద్ద ప్రారంభించారు సంగీతం. అప్పుడు వారి వయసు 13 సంవత్సరాలు. త్యాగరాజు గారు 'నమో నమో రాఘవ' అని కీర్తన ను దేశికతోడి రాగంలో స్వర పరిచేరు.
గురువు గారి ఇంట్లో చేసిన కచేరీలో 'ఎందరో మహానుభావులు ' అనే కీర్తనను స్వరపరిచి పాడేరు ఇది పంచకృతులలో ఐదవది. ఈ పాటకు గురువుగారు శ్రీ శొంఠి వెంకట రమణయ్య గారు ఎంతో సంతోషించారు. అప్పుడే అతనిలోని మేధావిని గుర్తించారు. తంజావూరు రాజుగారికి చెప్పగా వస్తు వాహన లాంచనాల తో సభకు ఆహ్వానించగా......
త్యాగరాజు గారు నిధి కన్నా రాముని సన్నిధి సుఖమని ఆ కానుకలను నిర్ద్వందగా తిరస్కరించారు. ఈ సందర్భంగా పాడిన కీర్తన 'నిధి చాలా సుఖమా రాముని సన్నిధి చాలా సుఖమా' అని పాడేరు
సంగీతాన్ని భగవంతుని ప్రేమని పొందే మార్గంగా త్యాగరాజు గారు భావించారు.
******
త్యాగరాజు ;- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి