స్వేచ్ఛ మిగిల్చిన శేషం!(మినీ);- కొత్తపల్లి ఉదయబాబు - సికింద్రాబాద్
స్వేచ్చగా 
బ్రతుకుతున్నామనుకుంటున్న 
భ్రమలో...
నిబంధనల నేపథ్యంలో 
స్వతంత్ర  జీవులం మనం!

బ్రతికే పన్నులు ఎన్ని కడుతున్నా 
ముప్పై రెండు పన్నుల మధ్య... 
నాట్యమాడే కండరం చేసే 
వాగ్యుద్ధాలు అన్నీ నిరర్ధకమే!

ప్రతీ మనిషి చుట్టూ 
అదృశ్య పంజరమొకటి
అల్లుకునేఉన్న బ్రతుకులో 
స్వేచ్ఛ.... రాక్షసుడి 
ప్రాణం చిలకలో లాంటిది!

పుట్టిన ధ్రువపత్రం నుంచి 
కాటిన కాలిన బూడిద 
పిడతలు సంగ్రహించేవరకు 
ఊపిరితో పాటు స్వేచ్ఛ
ప్రేతాత్మలా తిరుగుతూనే ఉంటుంది.

పెదవులపై పూసిన 
చిరునవ్వుల క్షణాలు 
మానసిక ఆనందం 
మిగిల్చిన అనుభూతి మాత్రమే 
మనిషికి పన్ను కట్టక్కర్లేని 
స్వేచ్ఛ!కామెంట్‌లు