శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
771)చతుర్వేదవిత్ -

నాలుగు వేదాలనెరిగినవాడు 
వేదజ్ఞానము తెలిసినట్టివాడు 
వేదమూర్తి అవతారమైనవాడు 
విబుధమూర్తి యైనట్టివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
772)ఏకపాత్ -

జగత్తoతయు పాదమందున్నవాడు 
ఒక్కత్రాటిపైన నడుపువాడు 
అతిసమర్థుడైనట్టి వాడు 
చక్రము తిప్పుచున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
773)సమావర్తః -

సంసారచక్రo నడుపుతున్నవాడు 
సమర్థుడై సాగించగలవాడు 
ఒడిదుడుకులు తొలగించువాడు 
సమావర్తనము గలిగినవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
774)నివృత్తాత్మా -

అన్నియు తానైయుండినవాడు 
దేనినుండీ విడిపోనివాడు 
ఆత్మ నివృత్తి గలిగినవాడు 
బ్రహ్మమూలమై నిలిచినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
775)దుర్జయః -

జయింప శక్యంగానివాడు 
వీరుడై యుండినట్టివాడు 
సర్వులనోడింపగలవాడు 
దుర్జయ నామమున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు