ఘుమఘుమల తేనీరు;-అయ్యలసోమయాజుల ప్రసాద్వి-శాఖపట్నం.
ప్రాతః కాలంలో  ప్రభాత  సమయాన
కరాగ్రే వసతే లక్ష్మి చెప్పుకుని
దంతదావనమయిన  వెంటనే
రాయగడలో రైల్వేక్వార్టర్ నుంచి

ఆరవై ఏళ్ల క్రిందట ప్రారంభమయిన అమ్మ చేతి ఘుమ ఘుమ లాడే టీ త్రాగి
స్నాన సంధ్యాదులు ముగించుకుని
ఉత్సాహంగా ఉల్లాసంగా నేటి వరకు
ఏడుపదుల వయస్సులో కూడా ధర్మపత్ని చేతి టీతో
టీ త్రాగుతు సాహితీ సమూహాలలో
హుషారుగా పాల్గొనడం చూసిన నన్ను
మొన్న నలభై ఏళ్లు దాటిన
నా కూతురు తన కొడుకువి
నీ బుద్దులే నాన్న అంటే
పండిన మీసం మెలివేస్తు అన్నా
పొగ త్రాగనివాడు కాదు
టీ త్రాగని వాడు దున్నపోతై పుట్టున్ అని....!!
కామెంట్‌లు