అనుభవించ వలసిందే...! ; - కోరాడ నరసింహా రావు..!
నాలుగు భూత ముల శక్తు లనూతనలోిఇముడ్చుకుని ..పంచమ భూతమై ఆవిర్భవిం చింది ఈ భూగోళం...! 
 ఇది అద్భుత శక్తుల ఆయస్కా0త0...!! 

తను సృజించిన సమతుల సృ ష్ఠిని ఎలా పరిరక్షించుకోవాలో... 
 తనకు తెలియదా...!! 
 
మానవులతో సహా పసు పక్ష్యాది సకల ప్రాణి కోటినీ 
 సుఖించి ఆనందించమని... 
  వేరే గ్రహమున లేని సహజ సుందర ప్రకృతిని ప్రసాదించిందీ
 భూమాత...! 

 సమతుల్యతను నియంత్రిం చటంలో  ఆ ధర్మ దేవతతోపోటి
పడుతూనే ఉంటుందెల్లప్పుడూ

ఆ తల్లి నియంత్రణకు తిరు గుండదేనాడూ....! 
 రెయింబవళ్ళు , మూడు కాలాలు...చావు - పుట్టుకలు
 అన్నిటినీ తానే పర్య వేక్షిస్తుంటు0ది...! 

సకల ప్రాణి కోటి పుట్టుక, వృద్ది, క్షయము తరువాత తనలో కలుపు కుని.... క్రొత్త ప్రాణికోటి
 పునః సృష్టి ప్రారంభిస్తూ... 
  సమతుల్యతను కాపాడు తుంది...! 

ఈ భూమాతకు వేరే ప్రాణి వలనా లేని,రాని ఇబ్బంది ఈ మనిషి వలనె...!! 

తంగినంత యిచ్చినా తృప్తి చెందని మనిషి... సమతుల్యాన్ని సర్వ నాశనం చేస్తే... ఎంతకు తను మనకు తల్లి యైనా  , ఎలా సహించ గలదు...ఎన్నాళ్లని భరించగల దు...?! 

అందుకే... ఈ మల - మల మా డ్చే ఎండలు ఆకాల వర్షాలు... 
 భూకంపాలు, జల ప్రలయాలు

ఐనా మనిషి తెలుసు కోడె... 
 తీరు మార్చుకోడే...!! 
తెలియని అమాయకత్వమైతే
 క్షమించ వచ్చు...! 
  ఇది  అన్నీ తెలిసిన నిర్లక్ష్యం... 
 క్షమించరాని నేరం...!! 
  సిక్ష తప్పదు..., అనుభ వించ వలసిందే...!! 
      ********

కామెంట్‌లు