ఓరి నాయకుడా!;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఓటర్లను
భయపెడతావా
పోటీదార్లను
బయటకుగెంటేస్తావా

రాళ్ళను
పైకివిసురుతావా
తలలు
పగలకొడతావా

కర్రలను
తిప్పుతావా
కార్లను
ధ్వంసంచేస్తావా

బాంబులను
ప్రయోగిస్తావా
బెదరింపులకు
దిగుతావా

డబ్బులు
పంచుతావా
ఓట్లను
కొంటావా

అన్యాయాలకు
ఒడిగడతావా
అక్రమాలకు
పాలుపడతావా

నిందలు
మోపుతావా
పెడబొబ్బలు
పెడతావా

వాగ్దానాలు
గుప్పిస్తావా
మోసపుమాటలు
వల్లెవేస్తావా

అబద్ధాలు
చెబుతావా
అపనిందలు
వేస్తావా

ఎన్నికలను
ఎగతాళిచేస్తావా
ఎదుటివారిని
ఏడిపించుతావా

నీతిమంతుడనని
నాటకాలాడతావా
బుద్ధిమంతుడినని
భుజాలెగరేస్తావా

ఆగు ఆగు
వేచిచూడు
నీరంగు బయటపడుతుంది
నీనిజరూపం తెలిసిపోతుంది

ప్రజస్వామ్యం
నిలుస్తుంది
ప్రజాభిష్టం
గెలుస్తుంది


కామెంట్‌లు