తెలుసుకొనుము నరుడ! తిండి సరళి! (పంచపద్య ప్రభోదము) శ్రీగోపాలుని మధుసూదన రావు., హైదరాబాదు.,
       🚩తేట గీతి పద్యములు
            (1)
    తిండి మానవద్దు! మెండుగా తినవద్దు!
    తిన్న వెంట నడువు చిన్న నడక 
    యమితతిండి వలనె సమకూరు తిప్పలు
    తెలుసుకొనుము నరుడ తిండి సరళి
        (2)
    కుత్తుకవర కెపుడు కూర్చొని తినవద్దు
    విడుము కొంత పొట్ట వెలితి గాను 
    తినిన మన్న మరగు తీరును కల్పించు,
    తెలుసు కొనుము నరుడ! తిండి సరళి!
        (3)
    రేపు మాపు నీవు వేపుడుల్ తినవద్దు!
    పక్వకూర లెపుడు ఫలిత మిచ్చు!
    పచ్చి కూరలైన బహు రుచ్యముగ నుండు!
    తెలుసు కొనుము నరుడ! తిండి సరళి!
          (4)
   తొలుత రుచిని నిచ్చు దొంగ మసాలాలు
    పొట్ట యందు పిదప పెట్టు బాధ
    అట్టి వాని మెక్క పొట్ట పాడయ్యేను
    తెలుసు కొనుము నరుడ! తిండి సరళి!
           (5)
    ప్రకృతి యిచ్చె నీకు ఫలములన్ ఆకులన్
    తెలివిలేక వాని తినుట మాని
    చెరుపు గూర్చు నట్టి పరతిండ్లు తిన నేల?
    తెలుసు కొనుము నరుడ! తిండి సరళి!
      ఆరోగ్యమే మహాభాగ్యం

కామెంట్‌లు