శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
761)నిగ్రహః -
------------------
సమస్తమును నిగ్రహించువాడు 
లోకములు అదుపులో కలావాడు 
విశ్వ నియంత్రణ జేయుచున్నవాడు 
నిగ్రహమూర్తిగా యున్నట్టివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
762)వ్యగ్రః -

భక్తులను తృప్తిపరచునట్టి వాడు 
అందులోనే నిమగ్నమైనవాడు 
ఆశ్రితులను పాలించుచున్నవాడు 
వ్యగ్ర నామాంతరమున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
763)నైక శృంగః -

అనేక శృంగములు కలవాడు 
కొమ్ములు అమరియున్న వాడు 
శిఖరసమానుడైనట్టి వాడు 
నైక శృంగయను నామధేయుడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
764)గదాగ్రజః -

గదుడను వానికంటే పెద్దవాడు 
గదునికి సోదరునివంటివాడు 
పెద్దన్నగా భాసిల్లుచున్నవాడు 
గదాగ్రజుడై యుండినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
765)చతుర్మూర్తిః -

నాలుగు రూపములు గల్గినవాడు 
పరబ్రహ్మ సమానుడైనవాడు 
పలుఅంశలు వున్నట్టివాడు 
చతుర్మూర్తి వంతుడైనవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు