ఎదురు చూపు;- నెల్లూరు వేంకట లక్ష్మి ఎమ్మిగనూరు

 కుసుమ ధర్మన్న కళాపీఠం 
===================
చెలీ!
ఎప్పటిలాగే నీ రాకకై 
ఎంతగా ఎదురు చూశానో
ఆ రాకలో వేల వెన్నెలలు
మంచులా కరిగి పోయాయో
ఎన్ని ఉషోదయాలను
అమాసచీకట్లు మింగాయో
ఎర్రని సాయంత్రాలు
మందారాలై రేపటికీ ఎన్ని వేచివున్నాయో
గాఢంగా అల్లుకున్న చిమ్మచీకట్లలో
ఎన్ని కలలు జారిపోయాయో
నువు నడిచొచ్చే దారిలో
ఎన్ని ఎదురు చూపులు ఇరుక్కున్నాయో
కాలగర్భంలో ఎన్ని జ్ఞాపకాలు
సునామీ సుడిగుండంలో చిక్కుకున్నాయో
అయినా కూడా ఒక్క కన్నీటి చుక్కను కూడా రాలనివ్వను
రాలే కన్నీళ్ళను ఖననం చేస్తూ
వేచే వుంటాను నీ రాకకై
మూగబోయిన వేణువునై
కడలి  కెరటంలా వలపు గోదారినై
జన్మజన్మలకు వేచివుంటాను
కామెంట్‌లు