సుప్రభాత కవిత -బృంద
చీకటిని చీల్చుకుంటూ
వెలుగు పరచుకునేవేళ
కనుతెరచి లోకం చూస్తూ
ప్రకృతి పాడే కుసుమరాగం

వెలుగే జతగా అడుగులు
ఆశే ఆధారంగా నడకలు
ఊహలే ఊతంగా  కలలు
గెలుపే ధ్యేయంగా బ్రతుకు

కోరికల కోలాటాల మధ్య
ఆరాటాలన్నీ పోరాటాలై
కాలంతో సహగమిస్తూ
అలుపెరగని  పయనం

నడిచిన దారి గుర్తులు వదిలి
గడిచిన క్షణాలు అనుభవాలై
పొందిన అనుభూతులతో
ప్రతి క్షణమొక నూతన తేజం

కాఠిన్యాన్ని తలచి కసిగా
నిర్లక్ష్యాన్ని నిగ్రహంగా సహించి
అవమానాలను అధిగమించి
సహనపు హద్దును దాటక

గెలిచే ధైర్యం ఇమ్మని
కొలిచే దేవుని వేడగా
కొత్త ఉదయాని కానుకగా
చాచిన చేతికి ఇచ్చిన

వేచిన వేకువకు

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు