న్యాయాలు-499
ఘరట్ట న్యాయము
*****
ఘరట్టము అనగా తిరుగలి, విసుర్రాయి,రాగల్రాయి అనే అర్థాలు ఉన్నాయి.
బియ్యము, జొన్నలు సజ్జలు రాగులు, పెసలు, కందులు మొదలగు వాటిని విసిరేందుకు రాతితో తయారు చేసిన చిన్న యంత్రము. దీనికే విసుర్రాయి,తిరుగలి అని పేరు.
తిరుగలి లేదా విసుర్రాయి దిమ్మెలలో ఒకటి తిరిగేది, మరొకటి తిరుగనిది ఉంటాయి. కేవలము తిరిగేదానితోనో,తిరుగనిదానితోనో పని నెరవేరదు. రెండూ అలా ఉండాల్సిందే ఆనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
"మెదడుకు మేత సరదా సరదా పొడుపు కథ"ఇది చదివి జవాబు ఏంటో తెలుసుకుందామా...
"మా తాత అడవికి వెళ్ళి రెండు ఎద్దులు తెచ్చాడు.అందులో ఒకటి తిరుగుతుంది.మరొకటి తిరుగదు.ఏంటో చెప్పుకోండి చూద్దాం!"
దీనికి సరైన జవాబు తెలిసినట్లయితే... చిన్నప్పుడు తాతయ్యలు, అమ్మమ్మ, నాన్నమ్మలు చెప్పిన బోలెడు పొడుపు కథలు, సామెతల పరిజ్ఞానం చాలా చాలా ఉన్నట్లు లెక్క.
ఈ పాటికి తెలిసే వుంటుంది కదా !'మనం చెప్పుకుంటున్న న్యాయము లోని 'తిరుగలి' దాని పేరని.
ఇప్పుడంటే గిర్నీలు, పిండిమరలు వచ్చాయి. మిక్సీలు ,మిషన్లు వాటి హవా చూపుతున్నాయి. కానీ పూర్వకాలంలో బియ్యాన్ని పిండిలా విసరుకోవాలన్నా,పెసలు, కందులు, రాగులు, మినుములు ...ఇలా ఒకటేమిటి చిరుధాన్యాలను పిండిగానో, పప్పుల్లానో తయారు చేసుకోవాలనుకుంటే తిరుగలిలో వేసి బలమంతా ఉపయోగించి గుండ్రంగా తిప్పాల్సిందే.
అలా చేసేటప్పుడు తిరుగలిలోని పైన దిమ్మె మాత్రమే కదలి, కింది దిమ్మె నిలకడగా ఉంటుంది.పైన దిమ్మెను పిడితో తిప్పుతూ వుంటే తిరుగుతూ ఆ బరువుతో పిండి లేదా పప్పుగా మారి విసుర్రాయి చుట్టూ పడుతాయి.
ఇలా ప్రతి ఇంట్లో ఈ విసుర్రాళ్ళు వివిధ పరిమాణాల్లో ( సైజుల వారీగా) ఒకటి లేదా రెండు ఇసుర్రాళ్ళు తప్పకుండా ఉండేవి.అలా విసుర్రాయి లేని ఇల్లంటూ ఉండేది కాదు.
అంతే కాదండోయ్! పెళ్ళిళ్ళలో పసుపు కొట్టే శుభకార్యంలోనూ, పెళ్ళికూతురు,పెళ్ళి కొడుకు చేసే సందర్భంలో కొట్నాలు పెట్టడానికి ఇసుర్రాయిని చక్కగా అలంకరించి ఉపయోగించడం చూస్తుంటాం.
అలా ఓ చిన్న యంత్రమై ఇంట్లో వారికి ఉపయోగపడే ఈ వస్తువు పనిచేసే విధానం మనం తెలుసుకో గలిగాం.
అయితే మనవాళ్ళు ఖచ్చితంగా మనం ఆహారం నమిలే విధానం గమనించి దీనిని సృష్టించి వుంటారు. కాకపోతే తిరుగలిలో పైన దిమ్మె తిరుగుతూ ఉంటుంది.మన నోటి భాగంలోనేమో పై దవడ కదలకుండా కింది దవడ కదులుతూ వుంటుంది. అలా వుంటేనే దానితో మనం చేయాల్సిన పని తేలికవుతుంది.
అంటే రెండూ ఒకేలా వుంటే పని జరగదు కదా! మరి దీనిని కూడా ఒక న్యాయంగా ఎందుకు చెప్పి వుంటారు? మన పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి న్యాయము వెనుక తప్పకుండా ఓ నిగూఢమైన అర్థం వుంటుందనేది మనకు తెలిసిందే.
ఇక ఇందులో ఇమిడి ఉన్న విషయం ఏమిటంటే భార్యాభర్తల్లో ఒకరు బాగా వేగంగా నిర్ణయాలు తీసుకునేవారు ఉంటే ఖచ్చితంగా మరొకరు ఆలోచిస్తూ నిదానంగా దాని పూర్వాపరాలు ఆలోచిస్తూ నెమ్మదిగా నిర్ణయాలు తీసుకునే వారు వుంటారనీ.... అలాంటి వారిని ఉద్దేశించే ఈ న్యాయమును సృష్టించి వుంటారని అర్థమై పోతుది.
అలా ఇద్దరిలో ఒకరు నెమ్మదితనంగానూ,మరొకరిలో వేగంగానూ వుండటం మన చుట్టూ ఉన్న తరచూ చూస్తుంటాం. ఇవండీ ఘరట్ట న్యాయము యొక్క విశేషాలు.
అలాంటి వారిని చూసినప్పుడు ఈ ఘర న్యాయము తప్పకుండా గుర్తుకు వస్తుంది కదండీ!.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి