పాకిస్థాన్ లో హిందూ ఆలయాలు..;-అచ్యుతుని రాజ్యశ్రీ

 నేటి పాకిస్థాన్ లో వెయ్యి ఏళ్ల క్రితంకి చెందిన హిందూ దేవాలయాలు ఉన్నాయి ఇంకా!సింధు బెలూచిస్థాన్ పంజాబ్ లో ఉన్నాయి.కరాచీకి సమీపంలో కరావీపురమందిరం
పెషావర్ లో గోరఖ్ నాథ్‌  కాళీబారీ‌ఆలయాలు‌ ముల్తాన్ లో సూర్య దేవాలయం ముఖ్యంగా చెప్పుకోదగ్గవి.బెలూచిస్థాన్ లో హింగలాజ్‌ అమ్మవారి ఆలయం శక్తి పీఠం.దక్షయజ్ఞం తర్వాత సతీదేవిని కోల్పోయిన శివుడు ఆవేశం క్రోధంతో తాండవం చేయడంతో విష్ణువు  విశ్వం నశించకుండా తన సుదర్శన చక్రం తో సతీదేవి పార్థివ దేహాన్ని ముక్కలు చేశాడు.సతీదేవి శిరస్సు హింగ్ లాజ్ ప్రాంతం లో పడింది .ఆకొండచరియ ప్రాంతం విపరీతమైన వేడి శక్తి తో నిండి అంతటా వ్యాపించింది.బాబా చంద్రగుప్త అనే భైరవుడు ఆమె శిరస్సు ని కాపాడుతున్నాడు అని జనం నమ్ముతారు.ఇంకో కథనం ఏమంటే పరశురాముడు క్షత్రియులు అందరినీ సఫా చేస్తున్నప్పుడు కొందరు హింగలాజ్ మాత ఆలయం లో దాక్కున్నారు.వారిని ఆయన చంపలేదు.అమ్మవారు వారికి వేదం నేర్పింది.వారు ఆయుధాలు త్యజించారు.వీరు బట్టలు నేసే నేతగాళ్లుగా ఆనాటి భారతదేశంలో నివసించారు.పారిశ్రామికవిప్లవంకి ముందు వీరు నేసిన బట్టలు ప్రపంచ వ్యాప్తంగా వెలుగులు చిమ్మాయి.
ఇంకో కథనం ఏమంటే రావణుని చంపాక శ్రీరాముడు ఈ అమ్మ వారి ని దర్శించాలని సంకల్పించాడు.దానికి కారణం బ్రాహ్మణుడైన రావణుని వధించడం వల్ల పాపవిముక్తుడు కావాలని సైన్యం తో సహా బైలుదేరాడు.కానీ అమ్మవారి కి కాపలా కాసే భైరవులు దివ్య శక్తి గలవారు.రాముని రాజసప్రవృత్తితో రాకూడదు అని అడ్డగించారు.అప్పుడు సీత లక్ష్మణుడు హనుమతో కల్సి సుదీర్ఘ ప్రయాణం చేశాడు.మంచినీరు దొరక్క పోతే లక్ష్మణుడు హనుమ ఎంత గా భూమి ని త్రవ్వినా నీరు పైకి రాలేదు.అప్పుడు సీతాదేవి ధరణిని చేతులతో స్పృశించి హింగలాజ్ అమ్మవారిని ప్రార్ధన చేసి పూజించడంతో  అక్కడ నీటి కొలనులు‌  బావులు ఏర్పడినాయి.అలా ఎడారి ప్రాంతం లో నడుచుకుంటూ ఆఖరికి మాతని దర్శించుకున్నారు.అక్కడి గుహల్లో రాముడు సూర్యచంద్ర చిత్రాలు గీశాడు.ఇప్పటికీ వందలాది మంది భక్తులు తీర్థయాత్రలు చేస్తూ తప్పక ఈ అమ్మవారిని దర్శించుకోవడం ఓ అద్భుతం అనే చెప్పాలి 🌷
కామెంట్‌లు