కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని బుధవారం సాయంత్రం మండల కేంద్రంలోని గిరిజన చెంచు తెగకు చెందిన నిరుపేద కుటుంబాలకు పండ్లు పంపిణీ చేశారు. తన కుమారుడు ఈర్ల ఆదర్శ్ తో కలిసి ఆయన 50 మందికి 12 డజన్ల అరటి పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ అడవుల్లో, చేను, చేలుకల్లో కాపలాదారులుగా ఉంటూ పిల్లల్ని తమ వెంట తీసుకెళ్తున్నారని, దాంతో పిల్లల చదువు వెనుకపడుతోందన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్దనే ఉంటూ పిల్లల్ని రెగ్యులర్ గా బడికి పంపించాలని వారిని బాగా చదివించాలని ఆయన కోరారు. డిగ్రీ వరకు చదువుకుంటే ఎస్టీ కేటగిరీ కింద తప్పకుండా ఉద్యోగం, ఉపాధి దొరుకుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడి మాన్పించకుండా బాగా చదివించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడ పిల్లలకు బాల్య వివాహాలు చేయకూడదని, బాల్య వివాహాల వల్ల వారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందన్నారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ నూతన జీవన విధానాన్ని అలవర్చుకొని, మెరుగైన జీవనం సాగించాలని ఈర్ల సమ్మయ్య వారికి సూచించారు.
పేదలకు పండ్లు పంపిణీ చేసిన హెచ్ఎం ఈర్ల సమ్మయ్య

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి