సుప్రభాత కవిత ; - బృంద
పచ్చదనమే లేని చోట
పసిడి పంట పండగా
ముచ్చటలే లేనిచోట
మురిపాలు కురిపింప

నిద్దుర కాచిన కనులకు
ముద్దులు కురిపింప పొడిచిన
పొద్దును చూసిన మదికి
హద్దులు లేని ఆనందం

స్వప్నాలన్నీ సత్యాలయే
క్షణాలెన్నో పోగుచేసి
అలసి వేచిన మనసును
అలరించే ఆరాటం

మాన్యతలెన్నో కోల్పోయి
శూన్యమైన భవిష్యత్తును
భవ్యంగా మలిచే వరమిస్తూ
నవ్యకాంతులు గుప్పించే తరుణం

విసిగి వేసారిన మదికి
కొసరి ప్రేమలు కురిపించి
అలసిన ఆశల ఊయలను
ఉత్సాహంగా ఉఱ్ఱూతలూగించే

వెన్నెలంటి వెలుగులిచ్చు వేకువకు

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు