చిన్నారి గేయం ; జి. విజయ కుమారి
1) చీమ కేమొ కావాలి చక్కెరపలుకు 
కోతికేమో కావాలి కొబ్బరిచిప్ప
 కాకికేమొ కావాలి దాహమేస్తే నీరు
 మా బాబు కేమొ కావాలి రిమొటు కారు.

2) జామకాయ దోరగ వుంటె బాగుండు
టెంకాయ గుడిలొ కొడితె బాగుండు.           
 మునగకాయ పప్పుచారుతో తింటే బాగుండు
 శనగకాయ ఉప్పుతో ఉడికినదైతే బాగుండు. 
  మామిడికాయ పుల్లగ తియ్యగవుంతె బాగుండు.
 ముట్టికాయ అల్లరిచేసే పిల్లలకైతేనే బాగుండు.

3)అఆ, ఇఈ అనరాఅరటి పండు తినరా! 
ఎ, బి, సిడి అనరా అందని ఎత్తుకు ఎదగరా
ఒకటి రెండు అనరా పెద్ద ఉద్యోగం చేయరా!

4) నక్షత్రం మిలమిల
 పాప ఏడుపు వలవల 
బామ్మ గాజులు గలిగల, 
పొయ్యి మీద నీళ్ళు సలసల 
అప్పడం విరిస్తే ఫెళఫెళ-

కామెంట్‌లు