శ్రీ మాల్యాద్రి నారసింహ శతకము.;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర
 తేటగీతి పద్యములు 
--------------------------
46.
నీకు దాస్యము జేయుచు నిష్ఠ తోడ 
రాత్రి పవళులు గడిపితి లావుకొఱకు 
వినగ రావయ్య మా దేవ వేడ్కమీర 
నన్నుఁ బాలింపు మాల్యాద్రి నారసింహ!//

47.
దిశల వెల్గొందు దేవర దిక్కు నీవె 
యతిశయంబుగ చాటితి నాలకింపు 
నీవు తోడని యెరిగితి నిక్క మిదియె 
నన్నుఁ బాలింపు మాల్యాద్రి నారసింహ!//
48.
నీతి శాస్త్రము లెన్నియో నేర్పు తోడ 
చాల ఘనముగ తలచి నే చదువు కొంటి 
బుద్ధి నీమీద నిలుపని బోధ లేల 
నన్నుఁ బాలింపు మాల్యాద్రి నారసింహ!//
49.
చక్కదనముల సామినిన్ సన్నుతింప 
పెక్కు రీతుల భజనలు పేర్మి తోడ 
జేసి కొలచితి నీవె నా చెలుడ వనుచు 
నన్నుఁ బాలింపు మాల్యాద్రి నారసింహ!//
50.
దిద్దుకొందును దప్పులు దేవదేవ!
చక్క జేయవే నాబుద్ధి సాధువినుత! 
చిక్కు లన్నియు తొలగించి చేయిపట్టి 
నన్నుఁ బాలింపు మాల్యాద్రి నారసింహ!//

కామెంట్‌లు
Malalapragada Rama Krishna చెప్పారు…
నీకు దాసు నైతి నిష్ఠతో పూజలు
రాత్రి పవలు సేవ రవ్వ వెలుగు
మమ్ము జూడ వయ్య మాల్యాద్రి నరసింహ
విద్య లన్ని నీవి వేడ్క మీర

నమ్మ బలుకు నాది నాలకింపుము దేవ
దిశలు యన్నివి గను దిక్కు నీవే
మమ్ము జూడ వయ్య మాల్యాద్రి నరసింహ
నిజము నిక్క మిదియె నిర్మలడవు

నియమ శాస్త్ర మిదియు నేర్పు తోడ తెలుప
చదువు కొంటి నేను చాల ఘనత
మమ్ము జూడ వయ్య మాల్యాద్రి నరసింహ
బోధ లీల నీది బుద్ధి నాది


భజన చేయు చున్న భక్తి నీదయతోను
స్వామి చక్క దనము సన్ను తింపు
మమ్ము జూడ వయ్య మాల్యాద్రి నరసింహ
చెలుడ వనుచు కోర్కె చింత మార్చు

తప్పు దిద్దు కొందు దయచూపు మాపైన
చిక్కు లన్ని మార్చు చేయి పట్టి
మమ్ము జూడ వయ్య మాల్యాద్రి నరసింహ
ధర్మ మార్గ మందు ధరణి నుంచు
Malalapragada Rama Krishna చెప్పారు…
నీకు దాసు నైతి నిష్ఠతో పూజలు
రాత్రి పవలు సేవ రవ్వ వెలుగు
మమ్ము జూడ వయ్య మాల్యాద్రి నరసింహ
విద్య లన్ని నీవి వేడ్క మీర

నమ్మ బలుకు నాది నాలకింపుము దేవ
దిశలు యన్నివి గను దిక్కు నీవే
మమ్ము జూడ వయ్య మాల్యాద్రి నరసింహ
నిజము నిక్క మిదియె నిర్మలడవు

నియమ శాస్త్ర మిదియు నేర్పు తోడ తెలుప
చదువు కొంటి నేను చాల ఘనత
మమ్ము జూడ వయ్య మాల్యాద్రి నరసింహ
బోధ లీల నీది బుద్ధి నాది


భజన చేయు చున్న భక్తి నీదయతోను
స్వామి చక్క దనము సన్ను తింపు
మమ్ము జూడ వయ్య మాల్యాద్రి నరసింహ
చెలుడ వనుచు కోర్కె చింత మార్చు

తప్పు దిద్దు కొందు దయచూపు మాపైన
చిక్కు లన్ని మార్చు చేయి పట్టి
మమ్ము జూడ వయ్య మాల్యాద్రి నరసింహ
ధర్మ మార్గ మందు ధరణి నుంచు