కలిస్తే;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 ప్రేమతో నమ్మకం కలిస్తే అమ్మ
భయంతో ప్రేమ కలిస్తే నాన్న
వినోదంతో సహాయం కలిస్తే సోదరులు
కష్టంతో ఇష్టం కలిస్తే ప్రేమికులు
ఇవన్నీ
నా జీవితంతో కలిస్తే
ఇంకెవరు?
నా నేస్తమే సుమా !!!
**************************************


కామెంట్‌లు