అన్నపూర్ణమ్మ - అన్న భిక్ష;- " కావ్యసుధ "
అన్నపూర్ణే సదాపూర్లే శంకరప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతీ! 'శివుని ప్రాణప్రియవైన సదా పూర్ణస్వరూపురాలవైన అన్నపూర్ణమ్మా ! పార్వతీ దేవీ! జ్ఞాన, వైరాగ్యాలు సిద్ధించేందుకై నాకు భిక్ష వేయుమా!' ప్రార్థన. !

అని అన్నపూర్ణా!-అంటే మనల్ని పోషింపజేసే జగ జ్జనని. ఈ దేహమనే దివ్యక్షేత్రాన్ని పోషింపజేసే అన్నాదులు, ఆ తల్లి స్వరూపాలే. 'అన్నం'వల్లనే మనకి శక్తియుక్తులు, చైతన్యం, సిద్ధి వుంటాయి. "అన్నాద్భవంతిభూతాని" అని శ్రీకృష్ణ వచనం.

భౌతిక దేహపోషణకి అన్నం (ఆహారం) ఇవ్వడమే కాక, శాశ్వతమైన ఆధ్యాత్మిక జీవన భిక్షని సమ కూర్చే విద్యాస్వరూపిణి. జ్ఞానమూర్తి కూడా ఆ అన్నపూర్ణమ్మే.

కనుకనే "జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి!" అని | ప్రార్థించారు ఆదిశంకరులు.

ఆ జ్ఞానవైరాగ్య భిక్ష లభిస్తే, శాశ్వత బ్రహ్మానందమే! ఆధ్యాత్మిక జీవితం నిర్విఘ్నంగా. పరిపూర్ణంగా. పుష్టిగా సాగాలంటే, ఆ 'జ్ఞానవైరాగ్యాలనే' అన్నం అవసరం.

పై శ్లోకంతో నిత్యం పార్వతీదేవిని ప్రార్థనచేస్తే సర్వశ్రేష్ఠం. ముఖ్యంగా ఏదైనా తినేముందు, తాగే ముందు అన్నపూర్ణమ్మను తలచుకోవాలి. పై ప్రార్థనతో తలచుకొని భోజనంచేస్తే. అమ్మ అన్నాన్ని జీర్ణింపజేసి. శక్తిని సమకూర్చుతుంది.

" కావ్యసుధ "
'వాజ్ఞ్మయ భూషణ'
'ఆధ్యాత్మిక సాహిత్య వ్యాసభూషణ్"
9247313488 : హైదరాబాదు

కామెంట్‌లు