శ్రీ మాల్యాద్రి నారసింహ శతకము.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.
 తేటగీతి పద్యములు 
===============
41.
నీదు లీలల గానంబు నియతిమీర 
జేసి తరియింతు నో దేవ చిత్తగింపు!
పుణ్య ఫలముల నొసగెడి పూజనీయ!
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
42.
జన్మ జన్మల బంధంబు చాలునయ్య!
పెద్ద కొండగ పాపంబు పెరిగిపోయె 
క్రుంగి పోతిని, నామీద కూర్మిజూపి 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
43.
జీవ రక్షక! నీ పాద సేవ చేసి 
దూలి పోవఁగ కోరితి దోషములను 
తిరము నీవని నమ్మితి దిశనుజూపి 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
44.
మనము నందున జొరబడి మాయ జేసి 
కామ క్రోధము లాడెనే కట్టుదప్పి 
పట్టు సడలింప రావయ్య పద్మనాభ!
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
45.
ఆపదలు తొలగించుచు నార్తిబాపి 
దాస కోటిని రక్షించు దాతవోలె 
నాదుకొనవయ్య శీఘ్రమే యాదిదేవ! 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//

కామెంట్‌లు