కల్పవృక్షం కాటన్ దొర - కొప్పరపు తాయారు
నిత్య గోదావరీ స్నాన 
పుణ్య ధోయో మహామతిః
స్మరామ్యాంగ్లేయ దేశీయం
కాటనుం తం భగీరథం !

అర్థం:: మాకు గోదావరి నదీ 
స్నాన పుణ్యాన్ని భగీరథుడు,
ఆంగ్లదేశీయుడైన కాటన్ దొర గారిని 
ప్రతినిత్యం స్మరించి తరిస్తున్నాము 

కాటన్ దొర గోదావరి డెల్టా 
పితామహుడు వన్నెకెక్కిన 
జలాల నయగారాల నడకల 
రూప శిల్పి, మహానుభావుడు 

పిన్న వయసును మిలటరీలో 
చేరి ఈస్ట్ ఇండియా కంపెనీ 
ఆర్టిల్లరీ, ఇంజనీరింగ్ సర్వీసులో
శిక్షణ పొందె, రాయల్ ఇంజనీర్స్ 

దేశంలో, సెకండ్ లెఫ్టినెంట్ గా 
నియమితుడయ్యె, మన దేశానికి 
వచ్చిన జలవనరులపై దృష్టి సారించి 
ప్రాజెక్టుల ను రూపకల్పన చేసి 

నిర్మించినాడు, రైళ్ల కన్నా 
నీటి ప్రాజెక్టు లే ముదమని 
మెచ్చినాడు, జనుల భవిష్యత్తుని 
ఎంచి, గోదావరి జలాలపై 

ధవళేశ్వరం వద్ద ఆనకట్ట 
గోదావరి పరీవాహక జిల్లాలను 
అత్యంత అభివృద్ధి పథంలో 
అధిక వ్యవసాయ దిగుబడులు 

సాధించే, క్షామ పీడితమైన 
గోదావరి సస్యశ్యామలమయ్యే
యావత్ భారతదేశం లో కొలెరూన్
పై ఆనకట్ట తంజావూరు జిల్లా 

యావత్భారత దేశంలోనే
అగ్రస్థానమాయె, గోదావరి 
ఆరు లక్షల ఎకరాల భూమి 
సాగు బడి భూమాయే, ఆ విధంగా 

భారత దేశ ప్రగతి కాంక్షించిన
ప్రప్రధమ ఆంగ్లేయుడు కాటన్ దొర !!!

కామెంట్‌లు