లేనిదెక్కడ; - కొప్పరపు తాయారు
వింతలలో వింత ప్రతీ
మానవుని శరీరం ఒక 
యంత్రం ,ఆయంత్రం
పనిచేయ వలసినది ఒకటి

అదే  రక్తపోటు,శరీరమున
రక్తప్రవాహం ఉన్నపుడు
అధికతమం,నిమ్నతమం ఉండు
దీని హెచ్చుతగ్గులే మనిషికి ..

యంత్రపని తనం, మంచి బుద్ధి 
ఆలోచన, హృదయ సౌందర్యం
మీద, దీని హెచ్చుతగ్గులు అధారం
సకల సంతోషాలు మంచి ఆరోగ్యానికి 

నాంది, నవ్వు నవ్వించు 
అదియే జీవిత ధ్యేయం 
చేసుకో ,పోటు లేదు,వేటు
రాదు,హాయికి రహదారి 

రక్తపు సంచారానికి సుఖప్రదం
వింత ఆలోచనలు లోగిళ్ళ
చిక్కు కున్న, చింతలు,వంతలు
దాచుకున్న జీవి,పోటులను

దోచుకోక మానడు,అందుకే
బుద్ధిః ఖర్మానుసారిణి 
తప్పించు,మెప్పించి, నడిపించ
ఈ బండి సకలం నీ చేతనే

దిద్ధుకో సర్థుకో పంచుకో
పెంచుకో సంతోషాలు 
నలుగురిలో,నలుగురితో
కల్మషం విడనాడి వెలిగించు

నడిపించు సుతిమెత్తగా 
ఆనందాల తో ఆహ్లాదంగా
హరివిల్లుల జీవితం !!

కామెంట్‌లు