అద్వైతం;-సి.హెచ్.ప్రతాప్

 అద్వైతం అంటే "రెండవది-లేని" అని అర్థం. బ్రహ్మం, జీవుడు, జగత్ అని మూడు విషయాలు లేవు. ఉన్నదంతా ఒకటే, అది బ్రహ్మమే అని అర్థం.సృష్టిలో కనిపించే పదార్ధాలెన్నో అసంఖ్యాకంగా ఉన్నట్టు కనిపిస్తాయి నీకూ నాకూ, కాని విమర్శించి చూస్తే ఎన్నో కావవి. అన్నీ కలిసి ఒకే ఒక పదార్ధం. అది ఎదోగాదు నా నీ స్వరూపమే. ఇదీ అద్వైత మనే మాటకర్ధం.జీవాత్మ, పరమాత్మల ఏకత్వ భావనే అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదిక. ఆది శంకరాచార్యులు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.చారిత్రకంగా దీని ప్రతిపాదకుడు గౌడపాదాచార్యుడు. ఇతడు శంకరుని గురువైన గోవింద భగవత్పాదునకు గురువు. బ్రహ్మమొక్కటే సత్యం. జగత్తు మిధ్య. ఈ జీవుడే బ్రహ్మం. జీవుడు, బ్రహ్మము వేరు కాదు.వేల ఏళ్ల చరిత్ర ఉన్న హిందు మతానికి మూలాలైన సిద్దాంతాలలో ద్వైతం, అద్వైతం ముఖ్యమైనవి. జీవాత్మ- పరమాత్మ వేర్వేరు కాదు.. రెండు ఒకటే అని చెప్పేది అద్వైతం. మనుషులు తనలోనే బ్రహ్మము ఉన్నాడనే విషయాన్ని గ్రహించి.. సాధన ద్వారా మోక్షాన్ని పొందటానికి ప్రయత్నించాలని అద్వైతం చెబుతుంది. ద్వైత సిద్ధాంతం- జీవుడు వేరు, బ్రహ్మము వేరు అనే విషయాన్ని పేర్కొంటుంది.సృష్టిలో ఎప్పుడూ దైవమే ఉంటుంది. అజ్ఞానం వల్ల, మోహం వల్ల మలినాన్ని అంటించుకోవడం ద్వారా ఆ దైవం జీవంగా మారుతుంది. అజ్ఞానాన్ని తొలగించుకున్న జీవుడే దేవుడని అద్వైత సిద్ధాంతం మనకు తెలియజేస్తుంది. ఈ ప్రతిపాదనకు అనుకూలంగా జగద్గురువు శంకరులు ఎన్నో భాష్యాలు రాశారు. 
కామెంట్‌లు