=ఆడపిల్ల జీవితం;- కె. ఉషశ్రీ. - 10వ తరగతి- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నీర్మాల.
 అనగనగా ఒక ఊరిలో ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. రాజు, రాధిక, రాజుకు కొడుకు అంటే ఇష్టం. కొడుకు పుట్టాలి. రాధిక కు కూతురు పుట్టాలి అని అంటుంది. కానీ రాధికకు ఆడపిల్ల పుట్టింది. రాజుకి ఏ మాత్రం కూతురు మీద ప్రేమ లేదు. రాజు కూతురితో మాట్లాడడు. చూసిన చూడకుంటా వెళ్ళిపోతాడు. కూతురు పేరు అశ్విని ఆ కూతురిని రాధిక బడికి పంపిస్తుంది. అశ్విని బాగా చదువుకుంటుంది. కొన్ని సంవత్సరాలకు తన చదువు పూర్తయింది. అశ్విని టీచర్ ఉద్యోగం వచ్చింది. అప్పుడు వాళ్ల అమ్మ, చాలా సంతోషించింది. వాళ్ల నాన్న అశ్వినితో నన్ను క్షమించు అమ్మ అని అంటాడు. రాజును రాధిక నీలో ఈ మార్పు కోసమే ఎదురుచూస్తున్నాము అని అంటారు. అశ్విని ఉద్యోగం చేసుకుంటూ వాళ్ల అమ్మ, నాన్నలను చూసుకుంటుంది.
=========================


నీతి, ఆడపిల్ల ఏదైనా పని చేయాలి అంటే ఆ పనిని వెంటనే చేసి చూపిస్తుంది. సమాజంలో చాలా ఆడపిల్లను కడుపులోనే చంపుకుంటారు. వాళ్ల నాన్నకు ఆడపిల్ల అంటే ఏంటో తెలిసే లాగా అశ్విని తన చదువు రూపంలో తెలియజేసింది.
కామెంట్‌లు