వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచనపల్లి,9182244143.
 మానవునిలో రకరకాల ఆలోచనలు ఉద్భవిస్తూ ఉంటాయి  ప్రత్యేకించి ఇతరులను గురించి ఆలోచించడంలో  ఎదుటివారికి ఎవరైనా కలిసి వచ్చింది అనుకుంటే  ఇతని మనసుకు చాలా కష్టంగా ఉంటుంది  అదృష్టం అంటే కలిసి వచ్చేది అని చాలామందికి ఒక అభిప్రాయం ఉంది  అది నిజం కాదన్న విషయం   పచ్చి నిజం    ఏదైనా ఒక అవకాశం దొరికినప్పుడు దానిని వెంటాడి దానిని శోధించి దానిని  సాధించగలిగినప్పుడు మానవుడు తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు  అది అదృష్టం  ఇతరులతో ఏదైనా గొడవ జరిగి  దెబ్బలాటలకు దారి తీసే అవకాశాలు ఉన్నప్పుడు మౌనాన్ని వహించి ఆ ప్రాంతాన్ని వదిలి  దూరంగా వెళ్లడం శ్రేయస్కరం  బంధాన్ని నిలుపుకోవడం  ప్రతి ఒక్కరి కర్తవ్యం  మానవుడు ఒక్కడే ఈ సమాజంలో జీవించలేడు సమష్టి గా జీవించడమే  సమాజ లక్షణం దానిని గుర్తించుకుంటే చాలు.ఏదైనా మంచి  కార్యం చేయాలని ఆలోచించినప్పుడు  ఆలోచనలతోనే సరిపెట్టుకోకూడదు ఆచరణ ముఖ్యం  ఒక చెరువు ఆ గ్రామానికి కావాలనుకుంటే  దానంతట అది వచ్చి పడదు కదా  దానికి మానవ ప్రయత్నం  నలుగురు కలిసి  పనిచేసినప్పుడు సఫలం అవుతుంది  సముద్రం కూడా ఒక నీటిబొట్టుతోనే ఎలా ప్రారంభమవుతుందో  ఒక అడవి మొత్తం చెట్లతో నిండి ఉండడానికి కారణం  ఒక చిన్న విత్తనం నాటి ఒక చెట్టును పెంచగలిగినట్లయితే  దాని ద్వారా అనేక విత్తనాలను  తయారుచేసి  నీకు కావలసినన్ని  వృక్షాలను పెంచుకోవచ్చు  ధన సంపాదన కూడా అంతే  వెయ్యి రూపాయలు అయినా లక్ష రూపాయలు అయినా రూపాయితోనే ప్రారంభం అవుతుంది ఆ రూపాయిని నీవు జాగ్రత్త పరుచుకున్నట్లైతే వీళ్ళు లక్షలు కోట్లు   వాటంతట అవే పెరుగుతూ పోతాయి  కనుక ప్రతి వ్యక్తి నీటి వాడకంలోనూ.డబ్బు వాడకాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి  అని ప్రజలు చెబుతూ ఉంటారు.
ప్రతి నది ఒక రాశి తో ముడిపడి ఉంటుంది నర్మదా పుష్కరం బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి 12 రోజులు ఈ పండుగలు జరుపుకుంటారు 12 జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర్ నర్మదా నది ఒడ్డున అనేక అందమైన ఘాట్లు నిర్మించబడ్డాయి ఈ నది ప్రవాహం నిరంతరం స్థిరంగా నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఘాట్లపైన నది లోతు ఎక్కువగా ఉండదు అది కాక భక్తులు సులభంగా స్నానాలు చేయవచ్చు బాధ్యత ఏర్పాటు చేయబడ్డాయి  ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న కోటి తీర్థ ఘాట్లో స్నానం చేయడం వల్ల కోట్లాది తీర్థయాత్రల పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు  పుష్కర కాలంలోనే మొదటి 12 రోజులను ఆది పుష్కర అని చివరి 12 రోజులను అంత్య పుష్కరం అని వ్యవహరిస్తారు ఈ మొదటి చివరి 12 రోజులు మరింత ప్రత్యేకమైన విగా  శాస్త్రజ్ఞుడు చెబుతారు వాటిని ఉపయోగించుకొని ముక్తిని పొందవలసిందిగా వేదాంతుల సలహా.

కామెంట్‌లు